పుట:శుకసప్తతి (పాలవేకరి కదిరీపతి).pdf/7

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

vi

ష్ఠుఁడై, రామరాయక్షమావరదత్త బిరుదాంకితరాజచిహ్నితుఁడై ప్రకాశించెను. ఈ రామదేవరాయలు , క్రీ. శ. 1534-1614 వఱకును విజయనగరసామ్రాజ్యమును సమర్థతతో నేలిన వీరవేంకటపతిరాయల వెనుక రాజ్యమునకు వచ్చి క్రీ. శ. 1630 వఱకును పాలించెను. కావున నీ కదిరీపతి 'తాత యగు కరెమాణిక్యనృపాలుఁడు క్రీ. శ. 1620 ప్రాంతమువాఁడు.

తాతవెనుక కదిరీపతి, పెద్దతండ్రి రామభూపతి 'శ్రీరంగరాయదత్తమత్స్యమకరధ్వజాఢ్యుఁడు' అని పొగడ్త కెక్కినవాఁడు. ఈ శ్రీరంగరాయలు విజయనగరసామ్రాజ్య ధీశులలో గడపటివాఁడని చెప్పఁదగును. ఈతఁడు క్రీ. శ. 1542 సంవత్సరమున సింహాసనము నధిష్ఠించి యిరువది మూఁడేండ్లు పరిపాలించెను. ఈతని కాలమున ననఁగా క్రీ.శ. 1665 సంవత్సరమున మహమ్మదీయు లీ రాజ్యము నాక్రమించుకొనిరి. కావున కదిరీపతి పెదతండ్రి క్రీ. శ. 1650 ప్రాంతమువాఁ డగుట స్పష్టమే.

రామభూపతి తమ్ముని కొమారుఁ డగు కదిరీపతియు శ్రీ. శ. 1660 ప్రాంతమున నుండుట నిర్వివాదముగా నేర్పడుచున్నది. మఱియు నీతఁడు శుకసప్తతియందు మొదటికథలో నాంగ్లేయుల నిట్లు పేర్కొనినాఁడు.

చ. “వలసిన బేరముల్ తెలియవచ్చినవారును వాదు గల్గువా
    రలు మఱి గుత్త గొల్లలును రత్నపరీక్షలవారుఁ గార్యముల్
    గలిగిన యింగిలీసుల ముఖాములుఁ జెంగట నుల్లసిల్లగాఁ
    గొలువున నుండుఁ జూపరులకున్ గనుపండువు సంఘటిల్లఁగాన్. (1-86)

ఇంగ్లీషువారు క్రీ.శ. 1639 సంవత్సరమున మదరాసున తొలుత వర్తకస్థాన మేర్పఱచుకొనిరి. వారు రాజ్యముకొఱకుఁ