పుట:శుకసప్తతి (పాలవేకరి కదిరీపతి).pdf/6

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

v

తనవంశమునకుఁ బాలవేకరి యను పేరువచ్చుటకుఁ గారణము గదిరీపతి యిట్లు చెప్పియున్నాఁడు.

"ఆ రసికావతంసకుల మాత్మసముద్భవహేతుభూతమై
ధీరత పాలవెల్లి జగతిం దగెఁ దన్మహిమం బపారగం
భీరఘనాఘసంభరణ భీమబలప్రతిభాప్తి గాంతు నం
చారయఁ బాలవేకరి కులాఖ్య వహించె నుదంచితోన్నతిన్.
ఆమహితాన్వవాయ వసుధాధిపు లచ్యుతగోత్రపాత్రు లు
ద్దామభుజాపరాక్రమవిదారితఘోరమదారివీరులై
భూమిభరించి రానృపుల భూతి మహోన్నతి నేలె భోగసు
త్రాముఁడు తాడిగోళ్ళ పురధాముఁడు శ్రీ పెదయౌబళుం డిలన్.

పై పద్యమున వర్ణింపఁబడిన 'పెదయౌబళుఁడు తాళికోట యుద్ధమున క్రీ. శ. 1565లో మరణించిన యళియరామరాజుకాలమున నున్న ట్లీక్రింది సీసపద్యపాదమువలనఁ దెలియు చున్నది.

"అళె రామరాజేంద్రు బలవద్రిపుల ద్రుంచు కలని కేధీరుండు కర్తయయ్యె" కావున నీతఁడు క్రీ. శ. 1560 ప్రాంతమువాఁ డని చెప్పనొప్పును.

ఈతఁడు మహావీరుఁ డగుటయేగాక మహాభక్తుడై శ్రీఖాద్రి నరసింహునకు భోగమండపాదులు గట్టించి ప్రఖ్యాతిం గాంచెను.

ఆవెనుక నీతని వంశమునఁ బ్రసిద్ది చెందిన వాడు కదిరీపతి నాయకుని తాత కరెమాణిక్యరాజు. ఈతఁడు రామరాయల సరిగద్దియ నొడ్డోలగమున నుండి, రామనామధ్యాననిష్ఠాగరి