పుట:శుకసప్తతి (పాలవేకరి కదిరీపతి).pdf/484

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చతుర్థాశ్వాసము 443

మ్మని పలుక న్వినిశ్చలతరాద్భుతుఁడై మదిఁ జెందు సందియం
బునఁ దలపోసి యాసచివపుంగవు డెంతయు నాదరింపుచున్. 255

గీ. ఇంక నొకతండ్రిగల దంటి విందువదన
యతనిఁ జూపెదవే యన్న నవ్వధూటి
మంచి దీరేయి జూపెద నంచు బలికి
యవలి కరిగిన యమాట లాలకించి. 256

క. ఆలోలాంగన తనదగు
శీలం బిది యెఱిఁగి పలికిఁ జెప్పగఁ బూనెన్
బోలు నని తలచి మిక్కిలి
జాలింబడి కొంతఁ బిలిచి సత్ప్రియరీతిన్. 257

గీ. అనునయించిన నబ్బాల యైననేమి
నన్ను బోషించెదేని యంతయును మఱపుఁ
దాల్తునని పల్కె నింక నత్తరుణి జనక
భావసంశయ మెట్లు బాపంగవలయు. 258

క. అనిపలికి యూరకుండిన
కనుఁగొని యౌరవ్యజలజగంధయు ఘనచిం
తొనరించి తెలియఁజాలక
వినుపింపు మటన్న కీరవిభుఁ డిట్లనియెన్. 259

వ. అంత నిశీధినీసమయం బగుటయు, నమ్మేథానిధివిభావధీరత తమఃపుంజంబగు కేళిమందిరంబున లోలాసమేతుండై యుండి యబ్బాలికం బిలచి ద్వితీయజనకుం జూపుమనిన నాశాంత యత్యంతమౌగ్థ్యంబు దాల్చి తదీయచ్ఛాయ జూపిన నతండు నవ్విలోలం జూచి యేతద్బాలికాలాపంబులకు నీయందు సందియంబుఁ జెందితినని తద్వృత్తాంతం బంతయుం