పుట:శుకసప్తతి (పాలవేకరి కదిరీపతి).pdf/39

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

బగపట్టెన్-ఇత్యాదిగా ననేకములు వాడినాఁడు. హాస్యరసము కడ కడుపు చెక్క లగునట్లు నవ్వు వచ్చును. హిందూస్థానీపదములం బ్రయోగించెను ఇంగిలీసులముఖాములు, పరాసులు ననునితరభాషాపదములు గలవు. సంస్కృత వాక్యములు - "స్వామి ద్రోహి మిదం భారం” “విపది ధైర్యమథాభ్యుదయే క్షమా." ఇట్టివి తెనుఁగుపద్యములలో సందర్బోచితముగా సులువుగా నుపయోగించును. సందర్భమునుబట్టి యొకచో వచ్చిన పద్యములే వేఱొకచో వాడినాఁడు. ఈకవికున్న ప్రపంచజ్ఞాన మితరకవులలోఁ బలువురకు లేదు.

పురాణాదులు సూతుండు శౌనకాదిమునులకుం జెప్పి నట్లుండఁగా నిటీవలిగ్రంథములను రచించినవారు చెప్పువాఁ డొక్కఁడు, వినువాఁ డొక్కఁడు నుండవలయునని నిర్బంధించుచున్నారు. కొందఱు దైవములకుఁ గృతి యర్పించియు, నరులకు నొసంగియు, సూతుండు శౌనకాది మహర్షులకుం జెప్పినదాని నవధరింపుమని చెప్పఁదొడఁగిరి. దానినిబట్టి యిప్పటికలికాలపు పేదరాసి పెద్దమ్మకథలకుఁగూడ నేనారదుఁడో యేయింద్రునతో చెప్పినట్లుగా నతుకుచున్నారు. ఈశుకసప్తతికథలు కేవల (నీచ) శృంగారకథలు. వీనిని గౌరికి శంకరుఁడు రహస్యముగాఁ జెప్పినాఁడని “ధౌమ్యమహర్షివర్యుండు నిరవధికకుతూహలధుర్యుండై యిట్లనియె" నని వచించుట యంత సరసముగా