పుట:శుకసప్తతి (పాలవేకరి కదిరీపతి).pdf/38

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఈ రామరాజుతనూజుఁడు రఘునాథరాజు. కరిమాణిక్యరాజు రెండవకుమారుఁడు రామరాజు. ఈతని తమ్ముఁడు నారపరాజు. నారపరాజు తమ్ముఁడు కదురక్ష్మాపాలుఁడు. ఈకదురరాజునకుఁ గదురమ్మయే దేవేరి యైనది. ఈసనామదంపతులకు కదురక్షాపాలుఁడు, వేంకటరాజునని యిరువురుతనయులు. ఈయిరువురు సోదరులలోని కదురక్ష్మాపాలుఁడే యీశుకసప్తతి గ్రంథకర్త కదిరీపతి. ఖాదిరిశబ్దమునుండియే కదుర, కదిరి రూపములు కల్గినవి. ఈవంశావళి బట్టి వసంతరాజుకుమారుఁడైన రామరాజు (రెండవ) శ్రీరంగరాయలచే బహూకరింపఁబడినట్లు చెప్పఁబడినందున శ్రీరంగరాయలు 1572-85 నాఁటివాఁడని తెలియవచ్చుచున్నది కావున రామరాజు పౌత్రుడు కదిరీపతికవి 17-వ శతాబ్దప్రారంభమునాఁటివాఁ డగునని తలంపవచ్చును.

ఈకదిరీపతికవి తన గ్రంథములో నన్నయభట్టారకుఁడు మొదలు తనవఱకుఁగలకవుల మర్యాదల నన్నింటిని బహువిధములఁ జేర్చినాఁడని యొక్కమాట చెప్పినంజాలును. స్వభావవర్ణనల కీతఁడు పెట్టినది పేరు. సామెతలగని, జాతీయములకు నిధి. అనఁగా ననఁగా నొకపురము-బిడ్డయొ పాపయో చిదిమి పెట్టినయట్లు- పుడకలువిఱిచి - చింతాకుముడుఁగుతఱి - మూసిన ముత్తెము-మిట్టిమీనై యదల్పు-బడాపగలఁజూచి-ఎట్లు నోరాడెనో-నీధర్మసత్రపుబ్రాహ్మణుఁడ - కడుపు చుమ్మలు చుట్టు - పంటఁ