పుట:శుకసప్తతి (పాలవేకరి కదిరీపతి).pdf/374

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తృతీయాశ్వాసము 333

తోడితెచ్చితేనియుం దదీయశ్రమాపనోదారం బగు నాహారం బిడవలయుం గదా యీకర్కరీవనంబు కొంచెంబగుటం బరాక్రమంబుఁ జూపకుండునే యంటివేని దానికిం బ్రతికార్యం బీయుపాయంబునఁ బన్ని వచ్చెద నని కర్ణోపాంతంబునం గొన్ని మాటలు నొడివి నిజాధినాథు దెస దరహాసంబగు నంగీకారంబుఁ గైకొని బుద్ధిసారుండు తదాస్థానంబు వెలువడి. 392

క. తటచలితచలదళచ్యుత
తొటతొటరవశాలిఫలమిథోరణకేళీ
పటుతరజలచరనికరో
త్కటమై తనరారు చెఱువు కాలువఁ జేరెన్. 393

తే. చేరి పనిపూని యిటకు నచ్చితి మదుక్తి
కొదవపడకుండ నెట్లొనఁగూడు నొక్కొ-
కార్యమని నాల్గుదిక్కులు గనుచునుండ
దైవవశమున నత్యద్భుతంబుగాఁగ. 394

సీ. క్రవ్యాగతోగ్రకాకవిధూతమక్షికా
పుంజమై తగు వెన్నుపుంటితోడ
బాలకక్రీడావిపాటితరోమజా
లంబైనయట్టి వాలంబు తోడ
నగ్రిమపాదబంధాతికృధాసముం
దనములౌ వెడవెడ దాట్లతోడఁ
గఠిననిజస్వామికరకాష్ఠనిహతజా
తంబునై తొరఁగు రక్తంబుతోడఁ