పుట:శుకసప్తతి (పాలవేకరి కదిరీపతి).pdf/373

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

332 శుకసప్తతి

చ. మును వినియుందు ధీరుని సమున్నతగర్వవిహారుఁ డంచు నా
తని మదికి న్భవద్బలవితానము చీమలచాలుఁ బోలె నై
కనఁబడు నీవు పల్కు నుడికారపుమాటల కెల్ల నాతఁ డా.
డును విరసంపుఁబల్కులు గడు న్మఱి మోసము వచ్చు నత్తఱిన్. 387

క. మోసము వచ్చుట యరుదే
యీసునం దద్గర్వభాష లిచటి సృగాలా
గ్రేసరులు సైతురే విను
మాసమయము సుమ్ము దొరల కవగడ మరయన్. 388

ఆ. అతఁడు గర్వయుక్తుఁ డౌటయుఁ గాకున్న
నొక నిదర్శనము మహోగ్రశౌర్య
ప్రభుగుణంబు విడిచి పరభూమి కింత దూ
రంబు వచ్చునే సరాళ మనుచు. 389

క. కావున గర్వాతురుఁడై
కావలెఁ గాదేని యిచటి కర్కరికాళిం
దావిని తదాశ వచ్చెం
గావలె నెట్లైన మనకుఁ గావలెఁ జుమ్మీ. 390

మ. మనకీకర్కరికాఫలాళిగద సామ్రాజ్యంబు గల్పింపఁ జా
లినయాహారము దానికై యితఁడు దోర్లీలాసముల్లాసతం
జనుదేర న్మనమేగి విందులగతి స్సంధించు టేకార్య మి
ప్పని నాకు న్సరిపోదు మీకు రుచియింపం బోలు నిప్పట్టునన్. 391

వ. అకార్యమాత్సర్యకృతానురాగు లగు నీనియోగుల మాటలకుం గోపాటోపంబు నామదిం బాటిల్లదు దుష్టనిరసనశుభానయనిష్టాగరిష్ఠులు కాక కాలోచితప్రభంజనమాత్రకృత్యులగువార లమాత్యులే యది యట్లుండె నతనిం గని