పుట:శుకసప్తతి (పాలవేకరి కదిరీపతి).pdf/35

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

భారతములో భీష్ముఁడు చెప్పిన జంతుజాలవిశేషములకథలే కావచ్చును. మఱియు హంస, చిలుక చెప్పుటచేఁ బిట్టకథలునై యున్నవి. కల్పితములేగాని జరగినవై యుండవలనులేదు. పచ్చిశృంగారము గుప్పించి కథ చెప్పినను దుదకు నీతి కనఁబఱపఁబడుచుండును. అవి నీతికథలను బురస్కరించికొని నీతి తెల్పఁబడుచుండును. ఒక్కదానిలోనికథలసామ్య మింకొక్కదానిలోఁ గనఁబడుచుండును. ఇంగ్లీషుభాషలో నిట్టికథ లున్నవో లేవో కానీ ఆరబ్బీభాషలో "ఆలఫ్ లైలా” (ఆరేబియన్ నైట్సు) వేయిరాత్రులకథ లీరీతివియే. హిందూస్థానీలో "శుకశారికల కథలు” (తోతా మైనా) గలవు. వానిలో నొకటి పురుషదుర్గుణముల నెంచి వారల నిందించిన రెండవది పురుషులపక్షము వాదించుచు స్త్రీలయవగుణము లెన్నుచుండును. ఎవరిపక్షము వారు సమర్థించుకొనుట చిత్రము. మనకథలకన్నింటికి సంస్కృ తములో మూలములు గలవు. బృహత్కథ, కథాసరిత్సాగరము నిట్టివానికి మూలములు కావచ్చును. ఇందేదేశమువా రేదేశమువారి ననుకరించిరో యూహించుట దుష్కరము. బుద్ధిమంతులు సర్వత్ర కలరు. ఏదేశపుఁబండితునకైనను లోకమునకు నీతి బోధించుటకు ధర్మోపదేశము చేయుటకు సద్బుద్ది పొడముచుండును. వారు వారు బోధించుమార్గములు భిన్నములుగా నుండును.

ఈశుకసప్తతి పేరునకు డెబ్బదికథ లనియున్నను మనకు దొరకినవి కొంచె మెచ్చుతక్కువ యుపకథలతోఁ గూడ