పుట:శుకసప్తతి (పాలవేకరి కదిరీపతి).pdf/34

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయ ముద్రణ పీఠిక.

ఆర్యులు చేయుపనులన్నియు స్వార్థరహితములు నిహపరసాధకములును. వారు రచియించిన భారతాద్యుద్గ్రంథములు మొదలు కవిచౌడప్పశతకమువఱకు నీతిబోధకములును, ధర్మోపదేశకములును, దన్మార్గమున మోక్షసాధకములు నగుచున్నవి. ఆయా గ్రంథములయందలి విషయ మేదై నను దుద కూహించినచో నది యేదో ధర్మమునో నీతినో బోధించునది యై తీరవలయును. అందుఁ గొన్నింట ధర్మాదులు స్ఫుటముగా నగపడును, గొన్నింట నూహించినం దోఁప గర్భితములై యుండును. పంచతంత్రము, హితోపదేశము, విక్రమార్కచరిత్ర మను ద్వాత్రింశత్సాలభంజికలకథలు, తదంతర్భూతములగు బేతాళపంచవింశతి, రేచుక్క పగటిచుక్క కథలు, హంసవింశతి మున్నగునవి యెల్ల నీతిబోధకములే. పంచతంత్రాదులు కొన్నిస్త్రీపురుషసామాన్యము లగువిషయములం దెలుపును. హంస వింశతి, యీ శుకసప్తతియుఁ గేవల స్త్రీలకొఱకే యని యూహింపవచ్చును. ఇందుఁ గామోద్రేకమునఁ బరదూతికాప్రేరణ మునఁ దప్పుత్రోవలంబడఁబోవుపడఁతులను సన్మార్గమునకుం ద్రిప్పుటకుఁగా ననేకోదాహరణములం దెల్పి శీలభంగము కాకుండఁ జేయుటయే ముఖ్యోద్దేశమైయున్నది. ఇవియన్నియుం బంచతంత్రమువంటి కట్టుకథలే ఈ కట్టుకథలకు మూలము మహా