పుట:శుకసప్తతి (పాలవేకరి కదిరీపతి).pdf/25

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

xxiv

లేదు. అందందు వ్యాకరణవిరుద్దప్రయోగములున్నను నవి కవి తెలిసియే కావలెనని వాడినవే కావున వాటివల్ల కవితకు న్యూనతకలుగుట లేదు.

౬. సాంఘిక చరిత్ర ౼ ౩౦౦ ఏండ్ల కిందట మన యాంధ్రు లెట్లుండిరి; స్త్రీపురుషులవేషము లెట్టివి. వారి వస్త్రము లెట్టివి, ఆభరణము లెట్టివి, వా రేపరిశ్రమలందు ప్రవీణులు, వా రేదేశాలతో వ్యాపారము చేసిరి, వారి వినోదములు, ఆటలు, పాటలు ఎటువంటివి, గ్రామాధికారులయొక్కయు, తలారులయొక్కయు అధికారము లెట్టివి, ఏయే తప్పుల కెటువంటిశిక్ష లుండెను, వివాదముల పరిష్కార మెటుల జరిగెడిది, శైవవైష్ణవమతముల ప్రాబల్య మెంతవఱ కుండెను, ఏయే దేవర్లను జను లాసక్తితో కొలుచుచుండిరి. ఇట్టి యనేకవిషయముల కీగ్రంథ మొకరత్నాలగని. ఇట్టి గ్రంథాలు కొన్ని యుండినందునను మనపూర్వికులను గురించి కొంతకొంతయైనను తెలుసుకొనగలిగినాము.

ఇవి శుకసప్తతిలోని ముఖ్య విశిష్టతలు. కవి తనను గూర్చి తానే యిట్లు కృత్యాదియందు వ్రాసుకొనినాఁడు.

సీ. కావ్య నైపుణీ శబ్దగౌరవప్రాగల్బ్య, మర్థావనాసక్తి యతిశయోక్తి
    నాటకాలంతార నయమార్గ సాంగత్య, సాహిత్య సౌహిత్య సరసముద్ర
    సకల ప్రబంధవాసన సువాక్ప్రౌఢిమా,న్విత చతుర్విధ సత్కవిత్వధాటి
    లక్ష్యలక్షణగుణశ్లాఘ్యతాపటిమంబు, నైఘంటికవదానునయనిరూఢి.
    గనిన నీకు నసాధ్యంబె గణుతి సేయ
    ధాత్రి శుకసప్తతి యొనర్పఁ దాడిగోళ్ల
    ఘనకులకలాప కదురేంద్రు కదురభూప
    చెలగి వాక్ప్రౌఢిచే గృతిసేయు మవని.