పుట:శుకసప్తతి (పాలవేకరి కదిరీపతి).pdf/24

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

xxiii

    నమరు ముస్సైజుతేజుతో నరుగుదెంచె
    దారుణాకారు డైన యుద్దారుఁ డొకఁడు.

(14వ కథ.)

ప్రబంధకవుల నాయికానాయకులకు విరహతాపము వచ్చినవారు పడెడునవస్థ యింతంత కాదు. వారు చంద్రుని, వసంతుని, వాయువును, చెడదిట్టుదురు. చిగుగటాకులను, కమలపత్రములను, ఱేకులను, పన్నీటిని, తెప్పించుకొని వాటిపై పొరలాడుదురు. కోకిలలను, తుమ్మెదలను, రావించి చీవాట్లు పెట్టుదురు. కదిరీపతి నాయికానాయకులందఱును సాధారణజనులే. కావున వారివిరహతాపముకూడ సహజమైనట్టిది. ఒకపంచాంగపు బ్రాహణునికి విరహతాపము ముంచుకొనిరాగా నతనియవస్థ యిట్లుండేను.

సీ. ఒడిలోన పంచాంగ ముంచుకొన్నది గాన కెటుపోయె ననుచు నూరెల్ల వెదకు
    పని లేనిపని వీథి జనుచుఁ గ్రమ్మరు నాత్మగృహ మంచు నెంచి యిల్లిల్లు దూరు
    అపుడు భుక్తి యొనర్చి యపునషేసంకటితింటినా యని యింటితెరవ నడుగు
    కంతుమాయల నుమ్మెత్తకాయ దిన్న, పొలుపు సారెకు దెల్పు నప్పుడమివేల్పు.

(14వ కథ.)

ఒక గొల్లభామకు విరహతాపము కలిగెను. ఆమె యి ట్లవస్థపడెను.

సీ. అదలించి పిదుకనియావు లుండగ వేగ, దోహనధేనువు దూడవిడుచు
    బానలోపల పచ్చిపాలుండ మించి చే, మిరియిడ్డపా ల్పొయిమీఁద బెట్టు
    పేరి పక్వంబైన పెరుగుండ గవ్వంబు, పులిచల్లలో నుంచి చిలుకబోవు.

(14వ కథ.)

ఈకవి శబ్దాలంకారములజోలికి పోలేదు. మారుమూలపదాలను వెదకెవెదకి వేయలేదు. ద్వ్యర్థులను బ్రయోగింప