పుట:శుకసప్తతి (పాలవేకరి కదిరీపతి).pdf/217

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

176 శుకసప్తతి

త్పతద్రథాంగసముత్తుంగపక్షపుటపటకటాత్కారసంభ్రాంతసకలశకుంతంబును, వెండియు వలీముఖపరికంపితశాఖాగళితకుసుమరసవిసరంబులపై ముసురుకొనునసమభసలంబుల వినీలంబైన నేలయుఁ గురంగనాభికాసద్యస్స్రుతమృగమదపంకిలం బైనభూమియు నభేదత్వంబుఁ జూపం బరిస్రుతప్రసవపరాగంబును, సప్తచ్ఛదరంభాస్తంభపతితరజోవ్రజంబును వేఱు లేక మీఱఁ దరణీకిరణవిదారితవేణుముక్తముక్తామణులును నచిరప్రసూతకుండలివనితాండంబులు నఖండంబులై మెండుకొనఁ గాసరంబులకు వాసరంబులును, గవయంబులకు నిలయంబులును, దుప్పులకు నెప్పును, జమరవాలంబులకు విభ్రమస్థానంబును, భల్లుకంబులకు నుల్లోకంబును, ఖడ్గసంతానంబునకు నిశాంతంబును, మయూరంబులకు జయారంభస్థానంబును నై సురసరణ్యానీతాగ్రయగు నొక్కయరణ్యానిం బ్రవేశించి కించిచ్చలనంబులేక యయ్యాకాశమధ్య యభ్యగ్రఝరీమధ్యంబునం గూర్చుండి మార్గాన్వేషణంబు సేయుచున్న సమయంబున. 245

తే. చెంతబారెడులో నికుంజాంతరమున
నొక్కబెబ్బులి యుండి యయ్యువిదఁ జూచి
కూర్చె నాహార మాఁకలిగొన్ననాకు
దైవమని యంతలో వేఱుతలఁపు వొడమ. 246

క. ఇదినాపద మిదినానద
మిదినాపొద చేర వెఱతు రెవ్వరు నేఁ డీ
మదవతికి నెన్నిగుండెలొ
కదలక నే యున్నయునికి కార్య మెఱుంగన్. 247