పుట:శుకసప్తతి (పాలవేకరి కదిరీపతి).pdf/216

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయాశ్వాసము 175

తే. చికిలిచౌకట్టు సరిపెణ ల్రక మెసంగు
నుంగరంబులు నొకవింత యొఱపు నెఱప
నేలి నాతనికొలువున కేగుదెంచుఁ
జూపఱు నుతింప నయ్యాయుధోపజీవి. 241

క. అతనికిఁ గలహప్రియ యను
సతి గల దయ్యతివ నడచుచందము లెల్లన్
మతినరయ నతనిపాలిటి
ప్రతిబంధపుఁ బేరఁటాలు పంకజవదనా. 242

క. ఆరమణినడత యొకటియుఁ
బేరొకటియుఁగాక యుండఁ బెనుదుఃఖముగాఁ
బోరాడ విసివి వేసరి
శూరుఁడు స్త్రీహత్యఁ జేయఁ జూడనికతనన్. 243

తే. వెడలనడిచినఁ బ్రతిరాజవీర మనెడి
పురమునందున్న పితృగేహమునకుఁ బోవఁ
దలఁచి యయ్యింతి డింభకద్వయముతోడ
నరిగెఁ బథికులచే మార్గ మరసికొనుచు. 244

వ. ఇవ్విధంబునం గతిపయప్రయాణంబుల నరిగి యొక్కనాఁటి పయనంబున నది మార్గంబుదప్పి కాలిత్రోవంబడి యక్షుద్రనిద్రావిరామసమయసముదితహర్యక్షకిశోరక్షుధారావసమాకర్ణనాతిభీతగర్భస్రవదర్భకానవలోకిపలాయమానధేనుకావితానంబును, దదీయశ్రవణపవనచలితకీచకాన్యోన్యకర్షణజనితధనంజయశిఖాభిముఖధావనాశార్దూలంబును, దదీయభీషణాకారవికారావలోకనమాత్రత్రస్తతటాకగాహనపరాయణవరాహంబులును, దదీయపతనచలితజలజాగ్రసము