పుట:శుకసప్తతి (పాలవేకరి కదిరీపతి).pdf/203

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

162 శుకసప్తతి

వాలోచన మెయిఁ దెలుపుము
బాలా యనఁ జిలుకతోఁ బ్రభావతి పలుకున్. 174

క. [1]మగువయె విడిచెద ననిన
న్మగవాఁడా నిలుపువాఁడు మానము నీవే
వగఁ జెప్పెదవో విని తగుఁ
దగ దనియెదఁగాని తెలుపు తత్కథ యెల్లన్. 175

చ. అన విని మంచిదంచు విహగాగ్రణి యిట్లను నట్టిభార్య వ
ర్తనమున కార్తినొందుమతిఁ దద్ధరణీసురమౌళి యొక్కనాఁ
డనుపమవైభవం బలర నార్తవశాంతి యొనర్చి నిత్యశో
భన బహులాభకారి యగు బ్రాహ్మణభోజన మైనపిమ్మటన్. 176

తే. చిఱునగవుతోడ నిజకాంతఁ జేరఁ బిలిచి
నీకు నేర్పెడువారలు లేక యునికిఁ
దెలుపవలెఁ గద కేళిమందిరమునొకట
తోయజామోద లెల్లను డాయువిధము. 177

క. మొగమున మసిబొట్టులు కర
యుగమునఁ గప్పెరయుఁ గత్తియు న్వ్రేలునెఱుల్
దిగమ్రింగెద ననుపలుకులు
దగఁ జేరఁగవలయుఁ గేళిధామంబునకున్. 178

తే. అనిన నంగీకరించి తానానతిచ్చి
నట్లె యేతెంచుదానితో నతను కేళి
దేలి ప్రతిరాత్రమును నట్టి తెఱుఁగు మీఱఁ
బడుకయిలు సేరఁగా నేఱుపఱిచె నతఁడు. 179

  1. మగువలవగలునువలపులు
    మగవాఁడా నిలుపువాఁడు మానమునీవే