పుట:శుకసప్తతి (పాలవేకరి కదిరీపతి).pdf/202

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయాశ్వాసము 161

తే. ఇట్లు పోషింప నాశారదేందువదన
కెలమి దళుకొత్తు బెళుకుఁగన్నులును ముద్దు
లొలుకు నవ్వులు గులుకుగుబ్బలమెఱుంగుఁ
జిలుకుటెక్కులుఁ దగువయశ్రీ నెసంగె. 170

వ. అంత. 171

సీ. వీథి నేగెడు ప్రౌఢవిటుఁడు పాడెడువింత
యేలపదా లట్టె యాలకించుఁ
బొరుగింటిమగవాని పొలుపైనఁ బెనుగోడ
యివ్వలఱోటిపై నెక్కి చూచు
నాయివారములకై డాయువారలతోడ
జోలి ద్రవ్వుచుఁ బెక్కుసుద్దులాడు
వరుసతో మాటాడవచ్చువిఫ్రులమ్రోల
రాకపోకల నొయారంబు నెఱపు
తే. నింటి కేతెంచు నెదురింటి యింతితోడ
దానిహృదయాధినాథువర్తనము లడుగు
రతు లెఱుంగకమున్నె యారాజవదన
వ్రాఁత తప్పింపఁజేయ నెవ్వరితరంబు. 172

తే. [1]ఆగృహంబున నిచ్ఛావిహారమునకు
మనసు పరువులు వాఱ నేమాడ్కి నైన
సందు గానక యినుపపంజరములోని
చిలుకపోలికఁ దలఁకు నక్కులుకులాఁడి. 173

శ. ఆలలన జారలీలా
లోలితమతి యుడుపుటెట్టులో జాణవు నీ

  1. అనుదినంబును నిచ్ఛావిహారమునకు