పుట:శుకసప్తతి (పాలవేకరి కదిరీపతి).pdf/200

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయాశ్వాసము 159

మ్రింగియు నూతనవధూయుక్తులై యూరేగువారి నిరీక్షించి మనంబునం గుందియు నార్తవశోభనపరాయణులైనవారలం గనుంగొని భిన్నత్వంబు నొందియు వివాహవాంఛాధీనుండై కన్యార్థియై పోయి యొక్కచోట నక్షత్రానుకూల్యంబు లేక మనోవైకల్యంబు నందుచు నొక్కయెడ జాతివిరోధం బైన వెలవెలం బాఱుచు నొక్కచాయ రాశిమిత్రత్వంబు చాలకుండినం బెండువడుచు నొ దారి గణవైపరీత్యంబైన నత్యంతం బనుతాపించుచుఁ బుడమి యెల్లం జెల్లందిరిగి యలబ్ధమనోరథుండై యుండి వెండియు. 160

తే. మునుపు చదివిన శాస్త్రసమూహమెల్ల
నూఁచముట్టుగ నొజ్జల గొప్పగించి
యుద్వహనకేళి చింతింపుచునికిఁ జేసి
పలుకు నిద్దురలోఁ బెండ్లికలవరింత. 161

క. ఊరెల్లఁ బిలిచిరేని య
పారంబగుచింత మునిఁగి పలుకం డదిగో
జేరె వివాహమఁటన్నం
దోరంబగు కాంక్ష నోరునోరే తెఱచున్. 162

తే. ఇట్లు చింతించి యవ్వటుఁ డేగుదెంచి
సోమశర్మగృహాళిందభూమి కొక్క
నాఁడు గ్రాసార్థమైరాఁగ వానినామ
మన్వయంబును నడిగియు నక్కుటుంబి. 163

క. మనయింటఁ గన్నె యున్నది
యనఘా యిదియేమి పెండ్లియాడెదవే మీ