పుట:శుకసప్తతి (పాలవేకరి కదిరీపతి).pdf/199

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

158 శుకసప్తతి

క. వేఱేపనులకు వచ్చిన
వారిం గని పడుచు నడుగ వచ్చిరటంచున్
గారాబుకూఁతునకు సిం
గారించుం దల్లియాస్యకమలం బలరన్. 155

క. ధరణీసురమాత్రుఁడు పే
రరయక యరు దెంచి పెండ్లి యాడినఁ జాలున్
వరదక్షిణతో నిచ్చెదఁ
దరళేక్షణ ననుచుఁ దండ్రి తలచు న్మదిలోన్. 156

తే. వార లీరీతి నుండిరో వామనయన
యంత బుధవంత మనునగ్రహారమునను
వినయవిఖ్యాతి మించు గోవిందుఁ డనెడు
బ్రహచారి చతుర్వేదపారగుండు. 157

తే. ఆతఁ డుపనీతుఁడైన యనంతరంబ
తల్లిదండ్రులు వోవ సంతాప మెడలి
యప్పురివరమందె విద్యార్థి యగుచు
నఖిలవిద్యలుఁ దనకుఁ దా నభ్యసించె. 158

క. అంతట నవ్వటుమణికిం
గంతుపరబ్రహ్మతావిఖండనచణవే
దాంతతిరస్కృతికరణా
నంతం బైనట్టిజవ్వనం బరుదెంచెన్. 159

వ. ఇవ్విధంబున సంప్రాప్తయౌవనుండై యతండు సమావర్తనహోమంబుల వ్రేల్చు వారలం గనుంగొని మోము వ్రేల్చియుఁ గల్యాణకంకణధారులం గనుంగొని యేకారియు నాకబలిసంవిధానంబు లాచరించువారలం గనుంగొని గ్రుక్కిళ్లు