పుట:శుకసప్తతి (పాలవేకరి కదిరీపతి).pdf/156

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రథమాశ్వాసము 115

వీని జన్మంబు కిష్కింధలోన నేమొ
కావలయునంచు శిష్యవర్గము గణింప. 497

క. వేదము చదివినఫలమున్
వాదించినఫలము సంధ్య వార్చినఫలముం
బైదలి నీకు నొసంగెదఁ
గాదనినం బ్రహహత్యఁ గట్టుదుఁ జుమ్మీ. 498

తే. అని యనన్వయరీతి నెన్నైన వదరి
పదరి యొక్కింతయును నీతి మది గణింప
కతనుఁ డనుమృత్యు వెసకొల్ప నల్లమంద
సమునఁ గల చీలలన్నియు సడలఁజేసి. 499

[1]సీ. అవునషే నను వివాహముగమ్ము విద్వాంసు
రాల వయ్యెదవు శీతాంశువదన
వివరింతు నొక పిన్న విన్నపం బాలింపు
మభిమతార్థంబు నీకగు మృగాక్షి
యలయింపనేటికే యకట నీశిష్యప్ర
శిష్యుండ నగునన్నుఁ జిగురుఁబోఁడి
పంచాస్త్రుఁ డిదె నేఁడు బాధించుచున్నాఁడు
బ్రదికింపవే నన్నుఁ బంకజాక్షి

  1. రాజాపేఁటదగ్గఱ మద్దిరాలలోఁ దెచ్చిన ప్రతిప్రకారము.
    సీ. అవునషే నను వివాహముగమ్ము విద్వాంసురాలవయ్యెదవు శుభ్రాంశువదన
    అవునషే నను మనోభవకేళి నేలవే సోమిదమ్మవుదువె కోమలాంగి
    అవునషే నామాటలాలింపవే పురోహితురాల వౌదువే యిగురుఁబోణి
    అవునషే ననుబొందు మనిరళశ్రాద్ధాలయామాశనము తిందు వబ్జవదన
    తే. యేల నన్నింత యేచఁ నేల వినుము
    వనిత నీధర్మసత్రపు బ్రాహ్మణఁడను
    మనల నమ్మినవాఁడు బ్రాహ్మణుఁడటంచు
    నేటి కైనను దయఁజూడు నీరజాక్షి.

    వ. అని మఱియును.

    సీ. గోదాన ఫలదాన భూదానఫలములు చేరునంతటికైనఁ జేరుఫలము
    వివరించి తెల్పెద విన్నపం బాలింపు మభిహితార్థంబు నీ కగు మృగాక్షి
    అలయింపనేఁటికే యకట నీశిష్యుండ నగు నన్నుగాఁ జూడు మిగురుఁబోఁడి
    పంచాస్త్రు డిదె నేఁడు బాధించుచున్నాఁడు బ్రతికింపవే నన్నుఁ బంకజాక్షి
    తే. బ్రాహ్మణోత్తము నిపు డింత భంగపఱచు
    టంతయు నధర్మమని చెంత కరుగునంత
    యుల్ల మలరంగ నయ్యుగ్రభల్లుకంబు
    గుటగుట మటంచు రొప్పి యక్కుటిలు నొరసి.