పుట:శుకసప్తతి (పాలవేకరి కదిరీపతి).pdf/157

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

116 శుకసప్తతి

తే. బ్రాహ్మణోత్తము నిపు డింత భంగపఱచు
టెంతయు నధర్మ మని చెంత కేగునంత
నుల్ల మగలంగ నయ్యుగ్ర భల్లుకంబు
గుటగుట యటంచు రొప్పి యక్కుటిలుఁ గదిసి. 500

క. మెడఁబట్టుకొని తనూలత
జడియం గుదియించి నేలఁ జదికిలఁబడి య
మ్మడియఁడపు డెంత పొరలిన
విడువక మృత్యువు కొనర్చె విందు లతాంగీ. 501

క. అని కీరకులశిఖామణి
యనుగాథ కృతావధాన యై విని యయ్యం
గన యిది విచిత్రతరమౌ
ననుచుం దరహసితవదనయై యుండు తఱిన్. 502