పుట:శుకసప్తతి (పాలవేకరి కదిరీపతి).pdf/15

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శుకసప్తతికథలకు మూలము

తెనుఁగులో శుకసప్తతికథలు అను నొకవచనగ్రంథ మున్నది. దానినుండి కదిరీపతికవిత యేర్పడినదనికానీ, కదిరీపతికవిత కది వచనమనికాని చెప్పుటకు వీలులేదు. బహుశః అది యిటీవల రచింపఁబడినదై యుండును. పద్యకావ్యమునకు వచనగ్రంథమునకు చాల వ్యత్యాసమున్నది. సంస్కృతములో నొకశుకసప్తతికలదని మాత్ర మెరుగుదును. కాని దానిని చూడలేదు. దానిని చూచినపండితులు దానిపై నభిప్రాయ మీయవచ్చును. కథాసరిత్సాగరము ప్రపంచకథలకు మూల ఖని. దానినుండి కొన్ని శుకసప్తతికథ లేర్పడినవి. కథాసరిత్సాగరము (క. స.) లోని లంబకము 2 తరంగము 4 లోని లోహజంఘునికథ శుకసప్తతిలోని 17వకథను బోలినది. క. స. లోని లం-2, త-5 లోని పరివ్రాజికా కథ శు. స. లోని యాఱవకథను బోలినది. క.స. లోని లం-2. త-5 లోని శుక్తిమతికథ శు. స. లోని 14వ కథతో సరిపోలును, ఈ విధముగాఁ గొన్నికథలు కథాసరిత్సాగరమూలకములు, శుకసప్తతిలో విక్రమార్కునికి సంబంధించిన 10 కథలు కలవు. అవి విక్రమార్కునిపేర ప్రచారమందుండు కథలనుండి గహించియుండును. 'డెకామరన్'లోని యెంకకథ శుకసప్తతిలోని యొకకథను బోలిన దంటిని. దీనినిబట్టి యిట్టికథలు మనదేశమునుండి యూరోపుఖండములో నెంతోదూరమందుండు దేశములందును వ్యాపించెనని తెలియవచ్చెడి. సంస్కృతశుకసప్తతి నుండి క్రీ.శ. 18 వ శతాబ్దినుండి ఫార్సీలోనికి "తోటీ కథలు అనుపేరుతో తర్జుమా యయ్యెనందురు. దాని