పుట:శుకసప్తతి (పాలవేకరి కదిరీపతి).pdf/137

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

96 శుకసప్తతి

తే. నాఁటి యలహంసజన్మంబు వీటిఁబుచ్చి
మగుడ మానుషవేషసంభవుఁడనైన
నేటికిని దద్వధూటిపై నెనరువాయ
నైతి నిఁక నేమనందుఁ బాండ్యక్షితీంద్ర. 398

ఉ. కావున నాఁడు నేఁ డితరకాంతల నేరిఁ బరిగ్రహింపనో
భూవర యంచుఁ దెల్ప నృపపుంగవుఁ డౌనని మెచ్చి బంధుసం
భావితలీల నాఘనుని భావ మలర్చి విశేషవస్తుసం
భావన లెల్ల నిచ్చి యులుపా లొనరించి పురంబుఁ జేరినన్. 399

వ. అంత. 400

తే. గరిమఁ దత్పాండ్యరాజన్యకన్యయైన
శాలికానామబాల య వ్వేళ నిజపు
రోపవనభూమి మునివృత్తి నొదిఁగియుండు
నలజయధ్వజవిభువార్త లాలకించి. 401

చ. నలనిభుఁ డీజయధ్వజుఁడె నావిభుఁ డంచుఁ దలంచునంతలో
వలపులఱేఁడు కెంపుజిగివంపుమొగంపుఁబటాణినూకి క
న్నులు గలవింట నప్పుడు వినూత్నశరావలు లేసి యార్చె న
మ్మెలఁత మెఱుంగుగబ్బిచనుమిట్టల హారలతల్ చలింపఁగన్. 402

క. అంత నలయింతి విరహా
క్రాంతమతి న్నిమిష మొక్కకల్పంబుగ న
త్యంతతరదురవగాహన
చింతం దంతన్యమానచిత్తాంబుజయై. 403

శా. మారుం బేర్కొనిదూఱు గంధవహుఁ బల్మాఱుం దుటారించి వే

సారుం జైత్రునిఁ గేరుఁ గేళివనసంచారార్థమై