పుట:శుకసప్తతి (పాలవేకరి కదిరీపతి).pdf/13

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఱంకుబొంకు, పచ్చిపిచ్చిశృంగారము, నీతిబాహ్యత మున్నగుపదాలకుఁ గవితలో నెంతవఱకు హద్దుపద్దు లుండవచ్చును? ఆనువిషయమును గురించి బహుప్రాంతములలో చర్చలు జరిగినవి. మనతెనుఁగునందుమాత్ర మే యిట్టివి కలవని తలపరాదు. సంస్కృతములో బహుగ్రంథము లిట్టివి కలవు. అచ్చతెనుఁగులో నేది బూతగునో దానిని సంస్కృతములో స్పష్టముగా నుచ్చరించుట బహుపండితులకుఁ బరిపాటి, మరుగుమాటలకు సంస్కృతము సహాయపడుచున్నదన్నమాట. శిష్యుల కేవగింపు గలిగించు కవితలను మహాకవులు కొందఱు ప్రతిభాషలో కొంతయైనను వ్రాసిరి. ఇతరదేశములందును జనులనీతికి భంగముకలిగించునని కొన్ని గ్రంథములను నణచివేసిరి. కాని తత్ఫలితముగా వానికి ప్రచార మెక్కువై యవి మఱింతవ్యాప్తిలోనికివచ్చెను. ఇటలీదేశములో 'బొకాషియో' అను నతడు క్రీ. శ. 1353 లో అనగా 600 ఏండ్లకు పూర్వము 'డెకామెరన్' (దశదివసకథలు) అను పదిదినాలకథలను నూఱింటిని రచించెను. అవన్నియు శృంగారకథలే. ఈ 600 ఏండ్లలో ప్రపంచములోని ప్రసిద్ధరచనలు ఆ 'డెకామరన్'నుండి ఏర్పడినట్టివి. 1894లో అమెరికాలోని న్యూయార్కులో అవినీతివిధ్వంసకసంఘ మొకటి 'డెకామెరన్' పుస్తకాన్ని నిషేధించుటకై కృషి చేసెను. అప్పుడు న్యూయార్కునగర న్యాయమూర్తియగు ఓబ్రిన్ (O'Brien). ఇట్లు తీర్పు చెప్పెను. “ప్రపంచవిఖ్యాతిగన్న సాహిత్యము (classics) ను ఖండించుట సాధ్యము కాదు. షేక్ స్పియర్, చాజర్, లారెన్సుస్టరన్,