పుట:శుకసప్తతి (పాలవేకరి కదిరీపతి).pdf/11

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వావిళ్ల వారిముద్రణము 1935 లో వచ్చెను. అందు వారు కృత్యాదిపద్యములను ముద్రించిరి. వాటిని చదివినతర్వాత నేను కళలో నిర్ణయించినకాలమందు మార్పేమియు నవసరము కాలేదు. నా మొదటినిర్ణయమే స్థిరపడినది. ఇతనివంశము వారందరును విజయనగరసామ్రాజ్యముతో శ్రీకృష్ణదేవరాయల కాలమునుండియు సంబంధముకలవారై సేనల కధిపతులై చక్రవర్తులచే బిరుదులందినవారై యుండిరి. పెదయౌబళరాజు “సమ గ్రమహాహవోగ్రసప్తతిసహస్రచాపభృత్సైన్యజితమదాహితేంద్రుండు." ఇది అతిశయోక్తియో లేక సహజోక్తియో తెలియదు. కరె మాణిక్యరాజు "రామరాయ క్షమావరదత్త బిరుదాంకుఁడు.” రామరాజు "శ్రీరంగరాయదత్తమత్స్యమకరధ్వజాఢ్యుఁడు." మఱి శుకసప్తతిక ర్తయగు కదిరీపతి కేవల మాకులపై గంటము త్రిప్పినవాడు కాఁడు. అహితులపై కఠారినికూడ ప్రశంసాపాత్రముగాఁ ద్రిప్పినట్టివాఁడు.

ఈకవికుల మెట్టిదో స్పష్టముగా లేదు. ఇతడు చంద్రవంశపుక్షత్రియుఁడైనట్లు తానే తెలుపుకొన్నాడు. రాజపదాంతనాములగుటచేత "రాచవారు” అనుకులము వారై యుందురు. వీరు అళియరామరాజు లేక శ్రీరంగరాయల వంశమువారైనట్లు తెలుపుకొనలేదు. ఆరాజులవద్ద సేనానులుగా నుండినట్లుమాత్రమే తెలుపుకొన్నారు.

ఱంకుబొంకుల ముచ్చట

మనదురదృష్టము చేత శుకసప్తతి పూర్తిప్రతి యింతవఱకు దొరకియుండలేదు, ఆంధ్రభాషోద్ధారకులగు శ్రీ వావిళ్ల వేంకటేశ్వరశాస్త్రిగారికృషి ఫలితముగా నిప్పు డించుమించు