పుట:శివరాత్రి మాహాత్మ్యము.pdf/99

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


క.

గబ్బున [1]నెదిరించిన నొక
దెబ్బగొను(ము నీకు) నెదురె త్రిజగమున నొరుల్
తబ్బిబ్బుగ జంగములకుఁ
బబ్బంబులు పెట్టు ముష్టిపరిఘట్టనలన్.

85


గీ.

వ్యాధు లష్టోత్తరశతంబు వచ్చుఁగాక
తోడ నేతెంచుఁగాక మృత్యువులు నూఱు
పంపినారము మున్నాడి భటులఁగూర్చి
కాలమృత్యువు గెల్చు శంకరునిహితుల.

86


వ.

అని పల్కిన వల్లెయని యులుంబరుండు వివిధవ్యాధిమృత్యుపరివృతుండై కదలి యుద్దవిడిఁ దూర్యంబులు మొరయఁ ప్రమథానీకంబుఁ దాఁకి శస్త్రజాలంబులు నిగుడ్చి పేర్చి యార్చినం గోపించి పంచవదనుభటులు కుటిలభ్రూభంగభూషణంబులగు మొగంబులు జేవుఱింప నట్టహాసంబు చేసి యదల్చి డమరుడిండిమ [2]ఠమఠమధ్వానంబుతోఁ గీనాశకింకరుల ముసల భిండివాల తోమర మండలాగ్ర త్రిశూల పట్టిసంబులఁ బ్రహరించిన విచ్ఛిన్నబాహూరుచరణవక్షః(కటికంఠ)లలాటకృకాటులై విచ్చియు నొచ్చియుఁ జచ్చియుఁ దెరలియుఁ బొరలియుఁ దోఁగియుఁ డాఁగియుఁ (గొంచియు జలించియు) గ్రుస్సియు డస్సియుఁ గందియుఁ గుందియుఁ దారియు (దేరియు) మ్రొగ్గియు డగ్గియు నలసియు సొలసియు [3]వికావికలై దిక్కామొగంబులై యౌరుసౌరులై [4]గురియై బందబందై భండనంబు విడిచి వలియ(ఁబాఱి వెళ్ళఁబాఱుచు) *(వెలవెలంబోయి) కృతాంతుని సన్నిధికిం బోయిరి. ఇట జటాధారులు సుకుమారుని బంధనంబు లూడ్చి యతని మున్నిడుకొని [5]హొన్నాళంపుఁ గరాచూరి చాయలం బంటించు మింటితెఱువునం జనిరి. అప్పు డా[6]సుకుమారుండు పుణ్యశివరాత్రివ్రతాలోకనప్రభావంబున.

87


తాళ రగడ.

దవుదౌవులఁ గాంచెం గైలాసము తరుణేందుకళాధరుని
నివాసము దశహరి[దవధి]స్థానస్థపుటితధవళచ్ఛాయాచ్ఛేదవిలాసము
ధ్రువమండల[వీథీ]సంరోధిస్థశృంగశృంగాటకవిహర-
త్ఖచరయక్షగరుడగంధర్వ[7]ప్రమదాస్తోమవిహితలీలాపరిహాసము
నవలేపాటోపసముద్భటవిఘ్నాధిపదీర్ఘవిషాణప్రఘణన-
వ్యాఘట్టన[[8]హర]పాదాద[ళితస్ఫటిక]ప్రస్థతటధ్వనివిసరము
[9]నవిహితలాక్షాముద్రానిగదవ్యాఖ్యాతాశోకలతాపల్లవ-
[10]యాథాతథ్యవిజిత్వ(ర)నీహారాద్రిసుతాచరణా[ధి]న్యాసము.

88


సీ.

కామధుగ్ధేనుసం(ఘముల) తొఱ్ఱులు గాంచెఁ
          గాంచెఁ గాంచనరత్నకందరములు
కాంచెఁ గల్పకవాటికాసహస్రంబులు
          సిద్ధరసాపగాశ్రేణిఁ గాంచె
బహుహిరణ్మయమహాప్రాకారములు గాంచె
          నమలిన(స్ఫటికసౌ)ధములు గాంచెఁ
బ్రబలచింతామణీస్పర్శవేధుల గాంచె
          నానావిమానరత్నములు గాంచె


గీ.

హావభావవిలాసరేఖావిశేష-
హారి [11]మూర్తుల రుద్రకన్యకలఁ గాంచె

  1. తా. నేతెంచిన
  2. తా. ఢమఢమ
  3. తా. పికాపికలై బిక్కామృగంబులై
  4. తా. గురిగురిలై బండుబండై
  5. తా. హిన్నాళంబు కరాచోళి చాయలం బట్టించు
  6. తా. బ్రాహ్మణుండు
  7. తా. ప్రమథ
  8. ము. పారద; తా. హపార
  9. ము. నవిహితరూక్షా
  10. ము. యాథాతవ్యయ విజిత్వనీహారాద్రి; తా. యాథాతవ్యయ విజిత్వర
  11. తా. మూర్తులు