పుట:శివరాత్రి మాహాత్మ్యము.pdf/100

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


(నంది దోడ్కొ)నిపోవ నర్ధేందుమౌళిఁ
గాంచె సుకుమారుఁ డంబికాకాంతు శివుని.

89


వ.

కాంచి దండప్రణామంబులు చేసి చేతులు [1]మోడ్చి (సుకుమారుండు) నమశ్శంకరాయ, శశాంకమూర్ధాలంకారాయ, [2]త్రిపురపురంధ్రినీరంధ్ర స్తనకుంభ[3]సముత్తంభిత కస్తూరికాస్థాసకముద్రా ద్రోహిబాహార్గళస్తంభాయ, జంభారిప్రముఖ నిఖిలదేవతాకోటిహాటక కిరీటకోటివిటంక[4]సందానిత మందారమాలికామకరందబిందునిష్యందధారాధౌత చరణారవిందాయ, జలంధరాసురకంధరాపీఠికావిఘట్టనక్రియాగరిష్ఠనిష్ఠురతా శశ్వ[5]ద్విభంగఖట్వాంగపాణయే, పశ్యల్లలాటాయ, మదనమదగదాగదంకారాయ, సంధ్యానటాయ. కరకలితడమరు[6]డాంకారబృంహిత బ్రహ్మాండమండలాయ, చండికాధిపతయే, నిరస్తసమస్తోపాధికాయ, సచ్చిదానందస్వరూపాయ, *(స్వమహామహిమప్రతిష్ఠాయ, నిరుపాధిక నిరవధిక నిర్ణిరోధ నిరవగ్రహ నిరభిసంధి నిర్భర కృపాసంపత్సపూర్ణ మేధసే, [7]నృకపాలమాలికాభరణాయ సముద్దండపుండరీక) క్రవ్యాదకృత్తికంధాధురంధరస్కంధభాగాయ, భగవతే ధన్యోఽస్మి! కృతపుణ్యోఽస్మి! *(నమస్తే నమస్తే) అని పలికి వెండియు.

90


తాళ రగడ.

జయజయ శంకర జయజయ పురహర జయజయ (కరుణా)గుణవరుణాలయ
జయజయ తుహినక్ష్మాధరకన్యాసహచర శాక్వరవర శుభకేతన
జయజయ మందర[8]కుధరోల్లుఠనాసంక్షుభితమహాక్షీరోదన్వత్
జఠరక్రోడప్రభవద్గరళజ్వలనగిళనకల్మాషితకంధర.

91


వ.

అని యనేకప్రకారంబులం బ్రస్తుతించిన సుకుమారుని మీఁదఁ గరుణాకటాక్షవీక్షణంబు లొలయించుచు విరూపాక్షుం డతనికిఁ గామగమనంబును హేమకింకిణీమాలికాసనాథంబును రుద్రకన్యాసహస్ర[9]సంకులంబునునగు దివ్యవిమానం బొసంగి ప్రమథత్వంబు కృపచేసెఁ బుణ్యవంతుల భాగ్యంబునకుం గొలఁది గలదె; యింక నెయ్యది [10]యడిగెద రడుగుండని సూతుండు నైమిశారణ్యనివాసులగు మహామునులకు సవినయంబును సస్నేహంబును సగౌరవంబునుగా విన్నవించిన.

92


గీ.

పరమమునులు సూత్యాహసంభవుని సూతు
భక్తిఁ బూజించి యధికతాత్పర్య[11]గరిమ
భటులు ప్రమథులచే భంగపడుట చూచి
చిన్నవోయి యముం డేమిచేసెఁ బిదప.

93


మ.

కరుణాసాగర శైవశాస్త్రకలనాగాంభీర్యశౌర్యోన్నతా
తరుణీమన్మథరాజపూజితకళా[12]ధర్మక్రియాసంస్తుతా
వరనీతిప్రతిభావిశేషకలనా వాగీశసంకాశ శ్రీ-
తరుణీనాథమనోజ్ఞరూప[13]విలసత్కావ్యార్థసంబోధనా.

94


క.

ధర్మార్థాలయవరగుణ-
నిర్మాణవిశేషవిభవనిరుపమకార్యా
కర్మోత్కటబహు[14]గుణవృత-
నిర్మలసుజ్ఞాన[15]చతుర నిశ్చలధైర్యా.

95


మాలిని.

శతధృతి[16]మతిదీపా సారనిర్మాణరూపా
సతతసుఖవినోదా సామగానప్రమోదా
వితతకవివరేణ్యా [17]వీరశైవాగ్రగణ్యా
యతులబలవివేకా హర్షనైర్మల్యపాకా.

96
  1. తా. మొగిడ్చి
  2. ము. త్రిభువన
  3. తా. సమస్తస్తంభిత
  4. ము. సంవాసిత
  5. తా. ద్విఘంగణా లంఘపాణయే
  6. ము. ఠాంకార
  7. ము. వృషాంక
  8. ము. కందర కంధర
  9. తా. సంనుతంబును
  10. ము. (వినవలతు)
  11. తా. గతి యమ
  12. తా. ధామ
  13. తా. విలసత్కార్యార్థసంబోధనా
  14. తా. గణవృత
  15. తా. వరిత
  16. ము. విస్ఫురత్పుణ్యగణ్యా
  17. ము. యతులఫలవివేకా