పుట:శివరాత్రి మాహాత్మ్యము.pdf/76

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


గీ.

మగువ పరదేశమున కేఁగి మగుడి వత్తు
కొంతకాలంబునకు నన్యచింత యుడిగి
యుండు నీ[వు] పుట్నింటియం దోర్పు గలిగి
మరలి రాఁడెట్టు [1]పరదేశ మరిగి మగఁడు.

130


వ.

అని పలికిన నిర్ఘాతపాతంబునకంటె నిర్ఘృణంబైన యమ్మాటకు శిరీషకుసుమసుకుమారంబైన తన మానసంబున నుస్సురంచు పుల్కసి యాననంబు వాంచి నిట్టూర్పు నిగుడించుచు నూరకుండె నప్పుడు).

131


చ.

కువలయపత్రనేత్ర కనుఁగొల్కులయం దుదయించె బాష్పబిం-
దువులు ధరాసురుండు తనుఁ దోడ్కొని[2]పోవ కుపేక్షసేయున-
న్న వదరవిందచక్రమిథునంబు లసహ్యవశాంగజాగ్నిచే
రవులుకొనంగఁ బుట్టిన నిరంతరధూమము సోఁకియో యనన్.

132


గీ.

చామ హృదయంబుమీఁద హస్తంబు వైచె
నతఁడు తనుఁ బాసి యేఁగునో యనెడు భీతి
నుల్లమునయందు వసియించి యున్న తన్ను
వెడలిపోకుండ [3]నడ్డపెట్టెడు విధమున.

133


వ.

అనంతరంబ యా చాండాలి యతని కిట్లనియె.

134


గీ.

ఎట్టు వేగింతు సంసార మిచట నుండి
యేల నినుఁ బాసి యొంటి నా కిచట నుండఁ
గలుగనిమ్ము [4]బంధువులు పెక్కండ్రు నాకు
[5]బంధువు గలండె నాకు నీపాటివాఁడు.

135


శా.

ఇచ్చోటన్ మధుపానగోష్ఠి సురతం బిచ్చోట సంగీతకం
బిచ్చోటం బరిపాటి నీ కలకలం [6]బిచ్చోట మానోదయం
బిచ్చో నంచు భవద్వియోగమునఁ దా నెవ్వారికిం బ్రీతిగాఁ
జచ్చున్ మన్మథవేదనానలమునం జండాలి విప్రోత్తమా.

136


మ.

కరవీరప్రసవచ్ఛదారుణ [7]పయఃకాషాయవస్త్రంబుతో
శరతూలచ్ఛవి యజ్ఞసూత్రములతో జాంబూనదస్ఫూర్తిత-
స్కరమృత్స్నానిటలోర్ధ్వపుండ్రకముతో సాక్షా[8]చ్ఛుకబ్రహ్మతోఁ
దరమౌ నిన్ను మహాత్మ రేపకడ సందర్శించినం జాలదే.

137


ఉ.

ధీరత పూని నీవు పరదేశము వోవఁగ నేను రాక యీ
[9]యూరనె యుంటినే ద్విజకులోత్తమ [10]నిత్యముఁ గాళికాగృహ-
ద్వారవితర్దికాస్థలము దవ్వులఁ జూచినయప్పు డెట్లొకో
కూరిమి పేర్మి గుండియ దిగుల్లని తల్లడ మందునో సుమీ.

138


సీ.

తను నిద్ర మేల్కొలిపిన మాత్రమున జర-
          త్కారుండు విడువఁడే ధర్మపత్ని
జమదగ్ని కొడుకుచేఁ జంపింపఁడే భార్య
          లవమంత దోష ముల్లమున [11]నిల్ప
[12]యొకమాటి తప్పుగావక యహల్యాదేవి

  1. తా. పరదేశి
  2. తా. పోవ కుపేక్ష సేయు న, న్నవదినప్డు చక్రమిథునంబు. ము. పోక యుపేక్ష సేయ న
  3. ము. అడ్డుపెట్టెడి
  4. ము. పెక్కండ్రు బంధులును నాకు
  5. తా. బంధువుఁడు నాకుఁ గలఁడె
  6. ము. బిచ్చో, మనోజోదయం
  7. ము. రజః
  8. తా. త్తుక
  9. తా. యూరన
  10. తా. నిన్నును
  11. ము. నిల్పి
  12. ము. యొకమాటు