పుట:శివరాత్రి మాహాత్మ్యము.pdf/75

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


 యొండెఱుంగక లజ్జ యుజ్జగించి మానం బూనంబు చేసి కులంబు పదటం గలిపి శీలంబు పరిత్యజించి దిట్టకూళయై కన్నుగానక కావరంబెత్తి తిరుగుచుండఁ గర్ణాకర్ణి నతని దుశ్చారిత్రంబులెల్ల విని [1]యెక్కడెక్కడ నాడికొనం దొణంగి రంత నెంతేనియుఁ [2]దేటతెల్లయైన యతని దుర్వర్తనంబు ప్రసంగించి ప్రకాశంబుగా నాడుచుండి రంత.

121


క.

క్రూరాత్ముఁ డితఁ డనఁగాఁ
జోరుం డితఁ డనఁగ నితఁ డశుద్ధుం డన దు-
శ్చారుఁ డితం డనఁగా సుకు-
మారున కపకీర్తి హూణమండలిఁ బ్రబలెన్.

122


వ.

అంత నొక్కనాఁ డతండును నదియును బాతాళపంకకలుషంబగు మహాజలధిపూరంబునుం బోలె నంధకారంబు తోరంబై దిక్కులఁ బిక్కటిల్ల బహుళపక్షంబు*(నాఁటి) రాత్రి కాళికాగోష్ఠంబు కెలన జీర్ణోద్యానంబు నడుమ నక్తమాలతరుషండంబులోఁ దార కల్పించిన సంకేతస్థలంబునం దృణకుటీరంబునం గోద్రవ[3]పలాలపర్యంకంబున మదిరోమదోద్రేకసంభవంబైన మదనావేశంబున మనోభవశర[4]సీత్కారంబులనుం బోలె సీత్కారంబులవలనను, బంచబాణమాణిక్యకంకణక్వణితం(బులునుం బోని మణితంబులవలనను, ప్రద్యుమ్నరథరథ్యరాజకీరహేషాకలకలంబులం బోలె కులుకుటెలుంగులవలనను, శంబరారాతినికేతన లీలోద్యానవాటికాతరులతాసంవేష్టనబంధనబులుం బోని యాలింగప్రబంధంబులవలనను, మకరధ్వజోపహార ద్రాక్షాఫలరసపానానుబింబంబులుం బోని చుంబనంబులవలనను, కుసుమకోదండదండయాత్రాసమారంభజృంభమాణ విజయతుత్తుంభగంభీరభాంకారంబులకుఁ దాతలుం బోని ముష్టిఘాతలవలనను, బహువిధోపచారసంపన్నంబైన సురతంబు సాగించి రప్పుడు.

123


శా.

హాలాపానమదాతిరేకమున నయ్యబ్జాక్షి గుంజాఫల-
ప్రాలంబంబు నటింపఁ జూపెను [రతిప్రౌఢిన్ స్వపుంభావమున్]
దాళీగర్భపలాశకల్పితబృహత్తాటంకచక్రద్వయీ
డోలాడోలనముల్ మనోభవభుజాటోపంబు రూపింపఁగన్.

124


వ.

అనంతరంబ.

125


ఆ.

కేలు గేలఁ బెనఁగఁ గాల్గాలఁ బెనఁగంగ
వారు చొక్కి [5]సురతపారవశ్య-
నిద్ర జెంది రపుడు నిశ్వాసమారుత-
ప్రమదములను నట్టి సమయములను.

126


మ.

కనియె నిద్దురవోయె మేలుకొనియెం గర్లుబ్బ గాంధారిప్రొ-
ద్దున వానీరము పువ్వు రాల్చు తఱి ముత్తో కంకటిం గూడి యొ-
య్యనఁ గోర్కొయ్యలు పశ్చిమాచలము డాయంబోవఁ గాత్యాయనీ-
వనమధ్యంబున బ్రహ్మబంధువు కుటీవాసాంతరాళంబునన్.

127


వ.

మేలుకాంచి తనదౌర్జన్యంబు కారణంబుగా హూణమండలంబునం బట్టిన రట్టుసడి నిమిత్తంబునం దన కచిరకాలంబున గా[ఁగ]ల ప్రాణాభిమానభంగంబు దర్కించి పరదేశంబునకుఁ బోవువాఁడై చండాలిక మనంబునుం దనమీఁదం గల యనురాగంబునుం దెలియు పొంటె తత్కాలంబున మేలుకనియున్నదానితో నిట్లనియై.

128


క.

సడియును రట్టును రవ్వయుఁ
బొడమెన్ నాకిపుడు హూణభూమండలిలో
బడితి[ని] నిట నీ దేశము
విడిచి చనన్వలయు నకృతవిషయంబునకున్.

129
  1. ము. యక్కడక్కడ
  2. తా. తేటతెల్లంబైన
  3. ము. పలాశ
  4. తా. శరాత్కారంబులునుం బోలె
  5. తా. ము. యితర