పుట:శివరాత్రి మాహాత్మ్యము.pdf/74

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


[1]శిశిరభూధరకన్య సేవింప ననిపోయి
          [2]నక్తమాలముల నెన్నడుమ [3]నొందె
కలమ సస్యక్షేత్రములకుఁ గూళ్ళొగి మోసి
          శణవాటికాప్రదేశముల [4]నొండె


గీ.

నెట్టు [5]కనుఁబ్రామి వచ్చునో యింటివారి
[6]నెట్టు (వెరవదొ యొం)టిమై నిక్క కరుగ
నతివ పగలైన మాపైన నతనితోడ
నిచ్చ [7]నొకసారి సాగించు నిధువనంబు.

116


వ.

[8]ఒక్కనాఁ డక్కనిష్ఠవర్తనుండు పక్కణశబరులం గూడి కరిక్రవ్యాదంబు(లగు కుక్కలం బట్టు)కొని ప్రత్యుషఃకాలంబున విపినవీథుల [9]నీవారభసలవిఘటితసరఃకమలషండసౌరభోద్గారభరిత దిక్కటాహంబు కరటిమార్గం బిదె, విదళితసమస్తముస్తాశకలసారంబు వరాహయూథపథం బిదె, కఠిన[10]విషాణకోటివిభిద్యమాన వల్మీకధూళిపాళికానిచుళిత తరుపలాశంబు మహిషవర్త్మం బిదె, దూర్వాప్రవాళచర్వణ[11]హరిచందన పరిపాండురంబు [12]హరిణమార్గం బిదె, [13]కటుదీర్ఘఘర్ఘరవ్యాక్రోశంబు కర్కరేటుకులకులాయస్థానం బిదె, కహ(కహారా)వంబు, దాత్యూహవ్యూహప్రదేశంబు ననుచు నాఖేటకౌతుకంబున నాఖేలనక్రీడావిహారంబుల [14]నృశంసుండై, ప్రాణిహింస [15]యొనర్చుచు వెండియు.

117


గీ.

పాపకర్ముండు కాంతారపథమునందు
[16]నదరిపా టొంటినంటి బ్రాహ్మణుల మొత్తి
యవహరించిన విత్త మన్యాయపరత
నంత్యజస్త్రీయుఁ దానును ననుభవించు.

118


గీ.

ఇవ్విధంబున సుకుమారుఁ [17]డీలు వుడిగి
మాలచిగురాకుఁబోఁడితో మనువు మనఁగ
వచ్చె నొయ్యన మధుమాసవాసరములు
[18]వాసితాశోల్లసత్ఫుల్లకేసరములు.

119


సీ.

కామినీగండూషకాదంబరీధారఁ
          బులకించె నారామభూమిఁ బొగడ
చివురాకుఁ జవిచూచి చవిచూచి [19]యెలుఁగించెఁ
          బంచమస్వరమునఁ బరభృతంబు
సంఫుల్లకోరకస్తబకాచితంబైన
          కొరవిపై [20]భ్రమరించెఁ గొదమతేఁటి
పరిపక్వసహకారఫలరసాస్వాదన-
          [21]మదమునం గీరంబు చదువదొణఁగె


గీ.

విటవిటీసముదయములు వివిధవిధుల
నుపవనక్రీడ సల్పిరి యుబ్బుమిగిలి
యఖిలజనులకు సంతోష మావహించె
మాసరములైన [22]మధుమాసవాసరములు.

120


వ.

ఇట్లు సకలజనమనోహరంబులగు మధుమాసవాసరంబుల(యందు), [23]నప్పాపిష్ఠుఁడు చండాలకన్యకం దగిలి

  1. ము. (శిఖరీంద్రవర)కన్య
  2. తా. నక్తతమాల నెన్నడుమ
  3. ము. నొందు
  4. ము. నొందు
  5. తా. కనువామి
  6. ము. నెట్లు (చీఁకటి నొం)టిమై నిక్కకరుగు
  7. తా. నొకవాలు
  8. తా. ఒక్కొక్కనాఁడ
  9. తా. నిదె రభసవిఘటిత
  10. ము. పాషాణ
  11. తా. హరిచ్చండపరిపాండురంబు
  12. తా. హరిణాధ్వం బిది
  13. తా. కదా
  14. ము. ఁగృశుండై
  15. తా. యొనర్పుచు
  16. ము. నదరిపాటున నొంటి
  17. తా. డిల్లు
  18. ము. వాసితాశోకసంఫుల్ల
  19. ము. యెలిఁగించె
  20. ము. బ్రమయించె
  21. ము. ముదమున
  22. తా. యమ్మాసవాసరములు
  23. తా. నప్పాపిష్ఠి