పుట:శివరాత్రి మాహాత్మ్యము.pdf/73

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


లాలరసంబు గ్రోలు నభిలాషమునం జనుదెంచియున్న వే-
తాళగణంబు వోలె నతిదైర్ఘ్యమునన్ దివి దాఁకియున్న హిం-
తాళవనంబు గన్గొని యతండు మహాద్భుతమందె నాత్మలోన్.

110


ఉ.

పైపయి గర్భగేహమునఁ [1]బన్నికమీఱి వెలుంగు మాలికా-
దీపశిఖాప్రరోహములు దేఱగఁ జూచి యనుస్మరించె లో-
నా పృథివీసురుండు మహిషాసురమస్త(కశోణితార్ద్ర)దు-
ర్గాపరమేశ్వరీపదనఖంబుల [2]రూపము సంవదించినన్.

111


గీ.

[3]సదనవనవాటికానికుంజములయందు
నెలుక లధరోష్ఠసంపుటంబులు గదల్ప
శక్తిమంత్రాక్షరంబులు జపముసేయు
నవియువలె నున్న నద్భుతంబందె నతఁడు.

112


సీ.

మంత్రవాదులతోడి మైత్రి సంపాదించు
          యంత్రవాదులఁ గని యాదరించు
సిద్ధయోగీశ్వరశ్రేణి సంసేవించు
          ధా(తువాదులకు వం)దనము సేయు
కదలి [4]వశ్యాశ్చర్యకథ లెఱుంగఁగఁగోరు
          బిలము సాధింప నపేక్ష సేయు
బహుదేశభాష లభ్యాసింప వాంఛించు
          శల్యతంత్రముమీఁదఁ జాఁపు మనసు


గీ.

(ఘుటిక కట్టఁగఁ) బెన్నిధి [5]గుద్దలింప
నింద్రజాలంబు వన్నంగ నిచ్చగించుఁ
[6]గట్టిభవనములకు సురంగములు ద్రవ్వ
నేర్చుకొనుఁ బ్రత్యహంబును నీచబుద్ధి.

113


చ.

[7]బతి చెడి మాంసభుక్తి మధుపాన జనంగమవంశభామినీ
రతిఁ బరతంత్రుఁడై నడుపుఁ [8]బ్రత్యయమున్ ధరియింపుచుండు న-
ప్పతితుఁడు గంగమట్టియయుఁ బ్రన్నని నున్నని నీరుకావిదో-
వతులును (బ్రహ్మసూత్ర)ములు వంశ్యులయిండ్ల [9]భుజించు కోరికన్.

114


గీ.

మాధుకరభిక్షలను స్వయంపాకములను
సత్రభోజవములఁ బితృశ్రాద్ధములను
విందులను దేహయాత్ర గావించు నతఁడు
వేదశాస్త్రపురాణప్రవీణుఁ డగుట.

115


సీ.

నీరాట నెపముగా నిర్ఝరంబుల కేఁగి
          సవిధవానీరకుంజముల [10]నొండె
భూధరంబుల కిప్పపువ్వు దే ననిపోయి
          కందరామధ్యభాగముల [11]నొండె

  1. తా. పన్నిన
  2. ము. డంబుల సంచరించినన్
  3. ము. సరస
  4. తా. వనాశ్చర్య
  5. ము. గుద్దలించు
  6. తా. గట్టు బాళములును సురంగా విధులను
  7. ము. స్థితి చెడి మాంస(భోజనము సేసి) యసంగమ
  8. ము. బ్రత్యహమున్
  9. తా. భుజించున్ గోరికన్
  10. ము. నొందు
  11. ము. నొందు