పుట:శివరాత్రి మాహాత్మ్యము.pdf/77

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


          నక్షపాదుఁడు ఱాయియగుమనండె
స్రుక్కి సన్నంబుగాఁ జూడఁడే కోపించి
          సతి నరుంధతి వసిష్ఠర్షివరుఁడు


గీ.

తగవు ధర్మంబు పాడి పంతంబు నిజము
పువ్వుఁబోఁడుల యెడ లేదు భూసురులకుఁ
బ్రథమమున నీవు చేసిన బాస నమ్మి
మోసపోయితిఁ [1]గులములో నీసు వడితి.

139


సీ.

పద్మాకరమునకుఁ బసపాడఁ దెచ్చిన
          దైవంబు చలము సాధ్యంబుగాఁగ
ననురాగరసము నా మనములో నూన్చిన
          నయనేంద్రియములకుఁ బ్రియముగాఁగ
విడువ నిన్నెన్నఁడు విశ్వసింపవె యన్న
          నీ సత్యమునకుఁ బున్నియముగాఁగ
నిక్షుకోదండ మెక్కిడి బాణ మరిఁబోయు
          కందర్పునకు మహాఖ్యాతిగాఁగ


గీ.

[2]నెపుడు నీవు ననుం బాసి యేఁగి తపుడె
నీరనైనను నురినైన నెగడినైన
విడుతుఁ బ్రాణంబు [3]లిపుడ నీ యడుగు లాన
పలుమఱునుఁ బెక్కుమాటలు వలుకనేల.

140


గీ.

అనినఁ జిఱునవ్వు నవ్వి నీ మనసు చూడ
నంటిఁగా కేను నినుఁ బాసి యరుగఁగలనె
యిట్టిపట్టున నెవ్వఱు నెఱుఁగకుండఁ
[4]బోవుటయ లెస్స యీ హూణభూమి విడిచి.

141


గీ.

ఎల్లి శ్రీభద్రకాళికి నిద్దభక్తి
యాత్ర యొనరించి వెళ్ళుద మర్ధరాత్ర
మీ విచారంబు చెప్పకు మెవ్వరికిని
వారిజానన రట్టువడ్డార మిచట.

142


ఉ.

సంగరసవ్యసాచి[5]వరశాస్త్రవిశారదదేశికేశ్వరా
మంగళగీతవాద్యపరిమండిత [6]ముద్రకకుండలీకళా-
భంగురనృత్త భవ్యపరిభాసితసంతతనిర్మలాత్మకా
యంగజసన్నిభప్రథితహాట్టవిశేషమనోజ్ఞవర్తనా.

143


క.

గౌరీవల్లభసేవా-
పారీణ విరాజివిభవభక్తిప్రతిభా-
భారోన్నతదివ్యాంగా
సారసగర్భప్రభావ సర్వజ్ఞనిధీ.

144
  1. ము. కులమునం దీసు
  2. తా. యెప్పుడేనేని ననుఁ బాసి యేఁగి తపుడు
  3. ము. లపుడు
  4. ము. పోవుటయు
  5. ము. నయ
  6. ము. మంద్రకరుండలీకళా