పుట:శివరాత్రి మాహాత్మ్యము.pdf/51

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


సీ.

ద్యూతకేలియ వినోదోపాయ[1]మయ్యెను
          బరదారగమనంబు ప్రౌఢియయ్యె
నాత్మభార్యాపరిత్యాగంబు ధృతియయ్యె
          [2]నాఖేటలీల విహారమయ్యె
గురుతిరస్కా[3]రంబ గరిమ[4]యయ్యెను నట-
          విటకీర్తనంబు[5]లే పటిమయయ్యెఁ
బానంబె యధ్యాత్మపరత[6]యై విలసిల్లె
          తరలతాగతియ యుత్సాహమయ్యె


గీ.

గుణము [7]దోషంబు దోషంబు గుణమునయ్యె
నపుడు సుకుమారునకుఁ దద్వయస్యులకును
నాదిగర్భేశ్వరత్వంబు యౌవనంబు
[8]సవురు ధనమును జనవు హేతువులు గాఁగ.

95


గీ.

[9]త మ్మమానుషకాలోచితంబులైన
కీర్తనంబుల [10]మై పులకించుకొండ్రు
తా రమర్త్యులుగా మదిఁ దలఁతు రహహ
విత్తమదమత్తచిత్తులై వెఱ్ఱిజనులు.

96


సీ.

అయ్య నీవు చతుర్భుజావతారుఁడ వన్నఁ
          దమ భుజాదండపార్శ్వములఁ జూతు-
రయ్య నీవు త్రిలోచనావతారుఁడ వన్న
          ఫాల మంటుదురు దోఃపల్లవమున-
నయ్య నీవు గజాననావతారుఁడ వన్నఁ
          గుంభపీఠము లంటికొనఁ దలంతు-
రయ్య నీవు [11]చతుర్ముఖావతారుఁడ వన్న
          [12]నద్దంబుఁ జూడంగ నభిలషింతు-


గీ.

రవసరం బిచ్చుట యనుగ్రహంబు గాఁగ
మోముఁ జూచుట యుపకారముగను బలుకు
మైత్రిగా నప్పు డధిక[13]సమ్మానముగఁ ద-
లంతు రైశ్వర్య[14]వైభవవంతు లుబ్బి.

97
  1. తా. మై తోఁచె
  2. ము. ఁజేలవిహారంబు సేమమయ్యె
  3. ము. రంబు
  4. ము. మయ్యె
  5. ము. లు
  6. ము. యయ్యె సమస్త
  7. ము. లకు నెల్ల
  8. తా. సవరదనమునుఁ జనువు
  9. తా. తమ్ము
  10. తా. మయి పులకించుకొనుచు
  11. ము. చరాచరావతారుఁడవన్న
  12. ము. నందంబు
  13. ము. తరార్థముగఁ
  14. ము. మదబల