పుట:శివరాత్రి మాహాత్మ్యము.pdf/50

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


గంగమట్టియమీఁదఁ గస్తూరిరసమునఁ
          బుండ్రకంబు లలాటమున నమర్చి
[1]విమలసన్మణికుండలముల పార్శ్వములందు
          లలితంబులగు [2]నొంటు లలవరించి


గీ.

యాత్మవంశపరంపరాయాతమైన
వైదికాచారమార్గంబు వక్కణించి
[3]యారజము రాచఱికమును నలవరించి
నగరవీథులఁ జరియించుఁ బ్రెగడసుతుఁడు.

90


గీ.

సచివనందను కర్ణపాశముల వ్రేలు
కుండలంబుల ముత్యాలగుళిక లొప్పు
నన్యలోకస్థుఁడగు శంబరారి కేడ్చు
రతిమహాదేవి యశ్రుపూరములు వోలె.

91


క.

కుసుమాయుధనిభుఁడగు నా
రసికునిపై వ్రాలు సానురాగముతోడన్
బిసరుహనయనల చూపులు
భసలంబులు పూపుఁదోఁటపయి వ్రాలు గతిన్.

92


గీ.

భావ మభిరామరూపైక[4]పక్షపాతి
యౌవనము దోషముల కెల్ల నాస్పదంబు
మన్మథుఁడు [5]కోపి యెటు నియమంబు నిలుచు
సుదతులకు వానిఁ గడకంట జూచినపుడు.

93


సీ.

హృదయ మువ్విళ్లూర నేకాంతమున నుండి
          వానిఁ [6]జింతింపని వనజముఖియు
నొకమా ఱతనిఁ జూచి యొండొక్కమఱి చూడ
          [7]నభిలషింపని విద్రుమాధరయును
గలలోన వానిఁ జిక్కఁగఁ గౌఁగిటను జేర్చి
          ముకుళితేక్షణగాని ముద్దియయును
నతని రూపంబుఁ గుడ్యములందు లిఖియించి
          [8]యందంబుఁ జూడని యంగనయును


గీ.

[9]జెలులచేతను బ్రోది రాచిలుకచేత
వాని గుణములు విని కుచద్వంద్వసీమఁ
[10]జాదుకొనఁ బులకింపని పైదలియును
బన్నిదము వ్రేసినను లేదు పట్టణమున.

94
  1. ము. కమలకర్ణిక
  2. తా. చెంప లలవరింప
  3. తా. ఆవజముతో చెరికము నలవడంగ
  4. ము. పాతకంబు
  5. తా. కోటవెట్టు నేమంబు నిలుచు
  6. తా. చింతించని
  7. తా. అభిలషించని
  8. తా. అద్దంబు సూడని యంగనయును
  9. తా. చెలువచేతను
  10. తా. జాదుకొనం బులకించని; ము. బాదుకోఁ