పుట:శివరాత్రి మాహాత్మ్యము.pdf/49

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


          గంకణంబుల ఝణత్కార మెసఁగ
నొకకొంతప్రొద్దు వల్లకి నఖాగ్రంబుల
          బహురాగముల నేర్పుఁ [1]బ్రస్తరించు
నొకకొంతప్రొద్దు [2]కొండికజవంబు లొనర్చు
          పరిహాసగోష్ఠికిఁ బల్లవించు
నొకకొంతప్రొద్దు లోకకథాప్రహేళికా-
          బిందుమత్యాదులఁ బిచ్చలించుఁ


గీ.

గొంతప్రొద్దు వినోదించుఁ [3]గొఱతలయిన
తోడివేడుకకాండ్రతో మేడమీఁద
విమలచంద్రోదయారంభవేళయందు
[4]బిల్లదీవాటలను మల్లు[5]పెనఁగుటలను.

87


వ.

ఇవ్విధంబునఁ దృష్ణావిషవల్లి [6]కాలవాలంబును, నింద్రియగుణంబులకు శరణంబును, మోహ[7]నిద్రకు విభ్రమశయనంబును, శాస్త్రదృష్టికి దిమిరోద్గమంబును, దోషాశీవిషంబులకు [8]నావాసవల్మీకంబును, *(సుగుణకలహంసంబులకుఁ బ్రావృట్కాలంబును,) గపటనాటకంబునకుఁ [9]బ్రస్తావనయు, ధర్మేందుమండలంబునకు రాహువక్త్రంబునునైన యౌవనారంభంబున.

88


సీ.

ఆజానుదీర్ఘబాహార్గళస్తంభుండు
          కోమలాళివినీలకుంతలుండు
కర్ణాంతవిశ్రాంతకమలాయతాక్షుండు
          పరిఫుల్లచంపక [10]ప్రసవనసుఁడు
బహుళాష్టమీశశిప్రతిమఫాలతలుండు
          కంబుసన్నిభచారుకంధరుండు
పరిపక్వబింబికా[11]ఫలపాటలోష్ఠుండు
          గంధవారణకుంభ[12]కఠినభుజుఁడు


గీ.

సచివతనయుండు కుపితధూర్జటిలలాట-
చక్షురనలార్చి రుద్గమసంప్రభూత
విస్ఫులింగచ్ఛటా[13]ఘటావేష్టనమునఁ
బసిమి దప్పని వలరాజు పగిది నొప్పె.

89


సీ.

[14]చరిగొన్న వెలిపట్టు జన్నిదంబులతోడ
          [15]రత్నాలతారహారము ధరించి
వలిపనీర్కావిదోవతిపైఁ బదార్వన్నె
          [16]కళయైన పసిఁడిమేఖల [17]ఘటించి

  1. తా. ప్రౌఢిచూపు
  2. ము. భాండక
  3. తా. ప్రౌఢలైన
  4. తా. పిల్లదీపాటలను
  5. తా. వెలుఁగుటలును
  6. తా. కావలంబంబును
  7. తా. నిద్రలకు
  8. తా. నివాస
  9. తా. ప్రస్థాపనయు
  10. తా. ప్రసవి
  11. ము. పరిపాటలోష్ఠుండు
  12. తా. కరిభుజుండు
  13. ము. వలీ
  14. ము. పరి
  15. తా. ముత్యాలతారహారములు దాల్చి
  16. తా. కళలైన
  17. తా. నటింప