పుట:శివరాత్రి మాహాత్మ్యము.pdf/48

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


          దంబును గణితశాస్త్రంబు దెలిసె
సరహస్యముగ నింద్ర[1]జాలమంత్రక్రియా
          తంత్రమంత్రములఁ జిత్తరువు గఱచె


గీ.

గ్రోల్చె యోగంబు సాధించె రుద్రభూమి
[2]సకలశస్త్రాస్త్రసంచయసమితి నేర్చె
తా. అభ్యసించెను విపులవైద్యములు నేర్చె</ref>నాకళించెను విపులవైద్యక్రమంబు
సంగ్రహించెఁ గవిత్వంబు సచివసుతుఁడు.

82


వ.

ఇవ్విధంబున సర్వవిద్యాపరిశ్రమంబునఁ [3]బ్రాగల్భ్యంబు వహించిన సుకుమారునకు శైశవంబు సరిగడచుటయుఁ బ్రదోషంబునకుఁ జంద్రోదయంబును, [4]జలధరంబునకు శక్రచాపంబును, [5]బుష్పంబునకు వాసనాప్రకారంబును, గమలవనంబునకు సూర్యోదయంబును, గంధగజంబునకు దానంబును, విజ్ఞానంబునకు మౌనంబును, [6]నవధ్యునకు గేయంబును, రాజ్యబలంబునకు నాజ్ఞాబలంబునుం బోలె భువనసమ్మోహనంబైన సౌందర్యంబున [7]కనురూపంబై జవ్వనం బావిర్భవించిన.

83


గీ.

బాల్యమునయందుఁ గలుగు సౌభాగ్యరేఖ
నినుమడించిన సౌందర్య మెసకమెసఁగ
సచివతనయుండు [8]తారుణ్యసంక్రమమునఁ
[9]బద్మముఖులకుఁ గన్నులపండువయ్యె.

84


శా.

పంచారామవిలాసినీధవళదృక్పాఠీనజాలాయమా-
నాంచ[10]త్కోమలనిర్నిబంధనమనోజ్ఞాకారరేఖా(కళా)-
పంచాస్త్రుండగు నా కుమారుఁ [11]డురుదర్పస్ఫూర్తి నవ్వీటిలో
సంచారం బొనరించెఁ గాంచనమహాసౌధాగ్రభాగంబులన్.

85


గీ.

ఆదిగర్భేశ్వరత్వంబు యౌవనంబుఁ
జక్కఁదనమును నతిసాహసంబుఁ జనవు
నొక్కఁడొక్కం[12]డు చాలు దోషోత్కరమున
కన్నియును [13]గూడియున్నవి యతనియందు.

86


సీ.

ఒకకొంతప్రొద్దు కందుకకేళి యొనరించుఁ

  1. ము. జాలంబు యంత్రక్రియా మంత్రతంత్ర చిత్తరువు గఱచె
  2. తా. కరభటజ్ఞానవీథికి గాలుసాఁచె
  3. ము. పారీణు
  4. తా. సజలబలధరంబునకుఁ జక్రవాకంబును
  5. తా. కల్పపాదపంబునకుఁ గుసుమప్రకారంబును
  6. తా. దానంబునకు నాత్మశ్లాఘావిపర్యయంబును
  7. తా. కనురాగంబైన యవ్వనం బావిర్భవించిన
  8. ము. తానొప్పి చారులీలఁ
  9. ము. బౌరజనులకు
  10. ము. త్కారము
  11. ము. రకుఁడు
  12. తా. డ బాలుఁ డోషోష్ఠమదమున
  13. తా. రూఢి