పుట:శివరాత్రి మాహాత్మ్యము.pdf/45

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


బెట్టె దొడ్డుగ [1]నామెత ప్రెగడగారు.

65


వ.*

అంత.

66

సుకుమారుని జననము

క.

నవమాసంబులు నిండిన
ధవళేక్షణ గాంచె సుతు సుధాకరతారా-
[2]రవిబుధధిషణవిధుంతుద
[3]కవు లుచ్చగముగను నమృతఘటికలు నడువన్.

67


వ.

ఇవ్విధంబున సుశీలాదేవి నందనుం గాంచిన వార్త [4]యంతఃపురపరిచారిణి యొకర్తె విన్నవించిన నమృతరపధారామయంబయిన యమ్మాటకు సద్యఃప్రరూఢరోమాంకురనికరకంటకితగాత్రుండును దరస్మిత *(వికసిత)కపోలమండలుండునునై మంత్ర్యాఖండలుండు.

68


ఆ.

తాను గట్టినట్టి చీనాంబరంబులుఁ
దాను బెట్టినట్టి మేనితొడవుఁ
బ్రమదమొప్ప నిచ్చెఁ బారితోషికముగ
మంత్రి యంతిపురము మానవతికి.

69


సీ.

[5]తలయంపి ధవళముద్రాకుంభ మిడువారు
          రక్షాభసితరేఖ వ్రాయువారు
గౌరసర్షపరాజి కలయఁ జల్లెడువారు
          బలివిధానంబులఁ బరఁగువారు
లవణంబు నింబపల్లవముఁ ద్రిప్పెడువారుఁ
          [6]బ్రేము మంచంబుతోఁ బెనఁచువారు
[7]గవలధూపంబు సంఘటియించువారును
          [8]మంచిము ట్టెడఁద యోజించువారు


గీ.

గదిసి దీవించువారును [9]గంధతైల
[10]మలదుకొనువారుఁ గాయంబు లందువారుఁ
బాడువారును బరిహాసమాడువారు-
నైరి శుద్ధాంతసతు లరిష్టాలయమున.

70


సీ.

కర్పూరసమ్మిశ్రగంధసారంబునఁ

  1. తా. నామిత
  2. ము. రవిసుత
  3. ము. కవులు భికములుగ నవమ ఘటికలు
  4. తా. యంతఃపురచారిణి యొక్క చకోరనేత్రి విన్నవించిన నవ్వాక్యంబు
  5. తా. తలయంటి ధవళనిద్రాకుంభ
  6. తా. ప్రేమ, మువ్వంబుతో
  7. తా. గమల
  8. తా. మంచిము ట్టెదుర
  9. ము. గండతైల
  10. ము. మందుకొనువారు