పుట:శివరాత్రి మాహాత్మ్యము.pdf/46

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


          జఱచెఁ [1]జప్పట భిత్తిఁ జామ యొకతె
[2]వెలికిలం బెట్టె నుత్పలగంధి యొక్కర్తు
          గప్ప గర్భగృహోపకంఠభూమి
జ్యేష్ఠాధిదేవత సేవించె నొకయింతి
          పసపుఁబుట్టము గట్టి భక్తిగరిమఁ
బటముపై లిఖియించెఁ బాటలాధర యోర్తు
          క్రొత్తలత్తుక [3]శశాంకుని ఖరాంశు


గీ.

[4]జరఠమేంఠంబు కంఠదేశమునఁ జుట్టెఁ
బుష్పడుండుభముల నొక్క పువ్వుఁబోఁడి
యంబుజానన యొకతె నెయ్యభిఘరించె
భుజగనిర్మోక మొకతె నిప్పులఁ గమర్చె. [5]

71


ఉ.

మంగళరత్నదీపముల మధ్యమునం బురుటింటి పాన్పుపై
నంగజసన్నిభుండు సచివాగ్రణినందనుఁ డొప్పె నెంతయున్
నింగిఁ బ్రదోషవేళ నతినిర్మలతారక[6]చక్రవాళముల్
సంగతిఁ జుట్టునుం గొలువఁ జాలఁగ నొప్పు శశాంకు కైవడిన్.

72


గీ.

బాలకుఁడు చంద్రచంద్రికాపాండు [7]వయిన
[8]పాన్పుపై నొప్పెఁ బొత్తులపై శయించి
యమృతవారాశిలోన శేషాహి మీఁదఁ
బవ్వళించిన కౌస్తుభాభరణుఁ బోలి.

73


గీ.

దానధర్మంబు లొనరించి త్యాగ మిచ్చి
బ్రసవగేహంబు సొచ్చి భూపాలమంత్రి
[9]యంబుపావకసంస్పర్శ మాచరించి
ప్రథమతనయు ముఖేందుబింబంబు సూచె.

74


గీ.

పురుడు చెల్లంగఁ బుణ్యాహమును నొనర్చె
నిలయదైవతములఁ గొల్చి నిజసుతునకు
మారసన్ని భునకు సుకుమారుఁ డనెడి
పేరువెట్టెఁ బ్రధానబృందారకుండు.

75


గీ.

పసపుఁబుట్టంబు ధరియించి పద్మనయన
సుతుని నుత్సంగమునఁ దాల్చి చూడనొప్పె

  1. తా. నప్పటి
  2. తా. వెలకెలం. ము. వెలకిల్లఁ
  3. తా. శశాంకశేఖరాంశు
  4. తా. జరధమేఢ్రంబు
  5. తాళపత్రమున నిచట రెండు మూడు పద్యములకు వలసిన చోటూరకే విడిచి యున్నది.
  6. తా. చక్రవాకముల్
  7. తా. వైన
  8. ము. పాన్పుఁ బొత్తులపై నొప్పెఁ బవ్వళించి
  9. ము. యప్డు