పుట:శివరాత్రి మాహాత్మ్యము.pdf/44

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


కటకఝణత్కార మెసఁగ గరపద్మము[1]లన్.

60


గీ.

మృదులగోధూమసరులతో మేలవించి
వన్నెకుచ్చుల పేరుతో [2]వక్కరించి
పుష్పడుండుభకంబుతోఁ బొత్తు [3]వడసి
బడఁతి పాలిండ్లపై [4]నొప్పె పసిఁడిపేరు.

61


గీ.

తగవులిచ్చిరి [5]పుట్టింటితల్లి ప్రజలు
వీళ్ళొసంగిరి చుట్టాలు వేనవేలు
[6]కట్టనిచ్చె నృపాలుండు కన్నుదనియఁ
బరమహీపాలురిచ్చిరి పావడములు.

62


సీ.

క్ష్మామండలము తురంగమధట్టమయమయ్యెఁ
          గరిమయంబయ్యె దిక్చక్రవాళ-
మంబరం బాతపత్రావళిమయమయ్యె
          సౌరభమయమయ్యె మారుతంబు
పరివారమయమయ్యె బ్రహ్మప్రపంచంబు
          జయశబ్దమయమయ్యె సకల[7]జగము-
లాత[8]పంబు విభూషణాలోకచయమయ్యె
          సంతోషమయమయ్యె జనులమనము


గీ.

వింధ్యపర్వత మేలు పృథ్వీవరుండు
దానుఁ బట్టంపుదేవియుఁ దగవుగలిగి
సచివునింటికి [9]నేతెంచి సమ్మదమున
నొద్దనుండి యా శోభన మొనరుచుటయు.

63


గీ.

[10]జవిలె నరఁబూలు ముడిచిన సాధ్వి యొకతె
[11]యోలగందంపుఁ బసపున నూన్చెఁ గదిసి
పసిఁడి యుత్తర[12]జందెముల్ [13]పాయఁబట్టి
రాచప్రెగ్గడ బ్రహ్మసూత్రమున నగుచు.

64


గీ.

దశరథుని వాజపేయంబు ధర్మసూను
రాజసూయంబు నుపమింపఁ [14]బ్రాఁతియె యని
[15]పట్టణంబును దేశంబుఁ బరిఢవింప

  1. తా. నన్
  2. తా. వక్కడించి
  3. ము. వచ్చు
  4. ము. నొప్పు
  5. తా. పుట్నింటి
  6. ము. కట్నమిచ్చె
  7. తా. జనము
  8. ము. పత్ర
  9. తా. నేతెంచు
  10. తా. జరధి నరమూల ముడిచిన
  11. ము. యుల్లగందంబు
  12. తా. జంధ్యాలు
  13. తా. వాయఁబెట్టి
  14. తా. ప్రాప్తమైన
  15. తా. పట్టణంబున దేశంబు పరిణమింప