పుట:శివరాత్రి మాహాత్మ్యము.pdf/43

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


ప్పఁ దదీయత్వరగండభాగములఁ గంపంబొందఁ దాటంకముల్.

55


సీ.

[1]పూజెకుండలు నిల్పెఁ బువ్వుఁబోఁడి యొకర్తు
          శుభవితర్దిక చతుష్కోణములను
[2]జాజాలపాలికల్ సర్వౌషధుల నించి
          ప్రోక్షించె జలము పద్మాక్షి యొకతె
కాంత యొక్కతె సన్నెకలుఁ బొత్తరంబును
          [3]దోరించె వటశాఖతోడఁ గూడఁ
బీఠికంబులు [4]వెట్టి బింబోష్ఠి యొక్కతె
          మడుఁగుఁ బుట్టము [5]గప్పె నడుగు మునుఁగ


గీ.

రమణి యొక్కతె వింజామరంబు దాల్చెఁ
దరుణి యొక్కతె తాళవృంతంబు పూనె
లలన యొక్కతె పసిఁడి సంబెల ధరించె
నాలవట్టంబు [6]వహియించె నతివ యోర్తు.

56


గీ.

మంత్రి [7]వేల్పించె గృహ్యోక్తమార్గ మొప్ప
బ్రహ్మపదమునఁ గూర్చుండి బ్రాహ్మణుండు
హోమములు రెండు బుగ్యజుస్సామవేద-
మంత్ర[8]మాది జయాదిహోమంబు తుదగ.

57


మ.

[9]చెవికిం గేలివతంసకోత్పలదళశ్రీలై కపోలంబులన్
నవకాలాగరు[10]పత్రరేఖలయి మేనం గమ్మకస్తూరియై
ధవళాంభోరుహ[11]నేత్రపైఁ గురిసె నుద్యల్లీల సీమంతపుం-
సవనాజ్యాహుతిహోమసంప్రభవచంచద్వహ్నిధూమచ్ఛటల్.

58


మ.

చెలికత్తెల్ చిఱునవ్వు చెక్కులపయిం [12]జెల్వార వీక్షింప నొ-
జ్జలు [13]మంత్రంబులు సెప్పఁ బ్రెగ్గడ శరత్సంపూర్ణచంద్రాస్యకున్
వలిచన్నుంగవమీఁద ముత్పులకము [14]ల్వర్ధిల్లఁ గేల్వంచుచున్
శలలీకంటక మెత్తి యౌఁదలపయిన్ సంధించె సీమంతమున్.

59


క.

కుటిలాలక [15]కుడి నాసా-
పుటరంధ్రము[16]నందు మూఁడుబొట్టులు [17]మిడిచెన్
వటఫలదళరస మధిపతి

  1. తా. పూజగుండలు నిల్పెఁ బూఁబోణి యొక్కతె
  2. ము. జాజాలపాలెల సర్వౌషధులు
  3. తా. దోలించె
  4. తా. వెట్టె
  5. తా. లిచ్చెగడలు మునుఁగ
  6. ము. ధరియించె
  7. తా. గల్పించె గుహ్యోక్త
  8. తా. వేద
  9. తా. చెవులం గేతిని
  10. తా. చిత్ర
  11. తా. నేత్రిపైఁ బొలసె
  12. తా. జిర్వార
  13. తా. చెప్పనప్డు
  14. తా. వర్ధిల్లెఁ గేల్సాచుచున్
  15. ము. కును
  16. ము. లందు
  17. ము. పిడిచె