Jump to content

పుట:శివరాత్రి మాహాత్మ్యము.pdf/42

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


గీ.⁠

[1]అల్లనల్లన మెలఁగుఁ బద్మాయతాక్షి
సముదితంబైన గర్భభారము కతమున
సమ్యగాపీతజలరాశిసలిల[2]మైన
ప్రావృడారంభనవమేఘపంక్తి వోలె.

⁠ 51


శా.⁠

[3]సీమంతోన్నయనంబుఁ బుంసవనముం జేయించె శ్రీయజ్ఞద-
త్తామాత్యాగ్రణి[4]చే నృపాలకుఁడు వింధ్యాధీశ్వరుం డర్మిలిన్
సామంతక్షితిపాలమంత్రు లసమానంబైన ప్రేమంబునన్
భామా[5]హేమతురంగరత్నములు పైపైఁ బావడల్ దేరఁగన్.

⁠ 52


సీ.⁠

కమ్మగొజ్జఁగి నీటఁ గలయంపి చల్లిరి
          [6]మేఁగి మెత్తిరి క్రొత్త మృగమదమున
రంగవల్లులు కప్పురపు [7]ధూళిఁ దీర్చిరి
          [8]కీరించి రొగి మాల్యతోరణములు
తరుణరంభాతరుస్తంభంబు లెత్తిరి
          కట్టి రెల్లెడఁ బట్టు కలువడములు
కమలచందనమాలికలు [9]వినిర్మించి రు-
          త్తంభించి రున్నతధ్వజపతాక-

⁠


గీ.⁠

[10]లాలిఖించిరి గేహకుడ్యములయందు
సర్వతోభద్రమకరికాస్వస్తికములు
పరిజనంబులు రాజాజ్ఞఁ బట్టణమున
యజ్ఞదత్తుని ప్రథమకళ్యాణవేళ.

⁠ 53


గీ.⁠

[11]వేడ్క నృత్యంబు లాడిరి వీథులందుఁ
బాడి [12]రెత్తిలి పికకుహూపంచమమున
[13]బంజళంబున ధవళప్రబంధగీతి
[14]కనుమ యవ్వలి కర్ణాటకమలముఖులు.

⁠ 54


మ.*⁠

అదనన్ వచ్చిరి సంభ్రమంబునను బంచారామలీలావతుల్
పదునాల్జాతుల యప్సరోంగనలునుం బాలిండ్లపై హారముల్
గదలం బెన్నెఱి సేసకొప్పులపయిం గహ్లారగుచ్ఛంబులొ-

⁠
  1. ↑ ము. అట్లు ధవునొద్ద
  2. ↑ తా. యైన
  3. ↑ ము. సీమంతోన్నతసంభ్రమంబు వెలయం
  4. ↑ ము. కన్నృపాలకుడు. తా. కిన్
  5. ↑ ము. సింధు
  6. ↑ తా. మ్రోకువెట్టిరి
  7. ↑ ము. మ్రుగ్గు వెట్టిరి
  8. ↑ తా. దోరించి రొగిఁ దల్యతోరణములు
  9. ↑ ము. ను నిర్మించిరి, స్తంభించి రుత్తమదర్పణములు
  10. ↑ తా. అభిలిఖించిరి
  11. ↑ తా. వెలఁదివెన్నలఁ బ్రాసాదవీథులందు
  12. ↑ తా. రొత్తిలి
  13. ↑ తా. పంజరంబున
  14. ↑ ము. కముల నవ్వేళ