పుట:శివరాత్రి మాహాత్మ్యము.pdf/38

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


ధవళాంబుజపత్ర[1]నేత్ర తథ్యం బరయన్.

29


వ.

ఈ దుఃఖంబునకుం గారణం [2]బేమి చెప్పుమని [3]యడుగుటయుం బ్రత్యుత్తరం బీక యూరకున్న దాని తాంబూలకరండవాహిని మంత్రితో నిట్లను దేవ దైవంబు కరుణలేమి జేసి, పెద్దకాలం బిమ్మహాదేవి సంతానలాభంబు దూరంబగుట కారణంబుగా శయనాసన[4]పానభోజనవిభూషణపరిధానాది సముచితవ్యాపారంబులు పరిజనప్రయత్నంబున *(బ్రతిదినంబు) నెట్టకేల[5]కు నిర్వర్తించుచు దేవరకు హృదయ[6]వేదన గావింపనో[7]క యనవరతంబుఁ దోఁపకుండఁ జరియించుచున్నయది [8]నిన్నటి రేపు తపనమండలంబు కుపిత *(కపికపోల) క్రోడతామ్రంబై యుదయగిరికవాటవిటంకంబు [9]నలంకరింప వింధ్యాచలనితంబబింబంబునకు మణిమేఖలాకలాపంబునుం బోలిన నర్మదాప్రవాహంబునం గ్రుంకి యోంకారేశ్వరు శశాంకరేఖాలంకారు హేమపంకజంబులం బూజించి గుడికి బ్రదక్షిణంబు నేయునది దేవభవనప్రాకారగోపుర ప్రఘాణంబునం బౌరాణికుండు మహాభారతంబు వక్కాణింపుచుం [10]గథానుకథనప్రసంగంబున నపుత్రకులకుఁ బుణ్యలోకంబులు లేవని పలికిన నప్పలుకులు నెమ్మనంబునం గీలుకొని వాలంప [11]ములుకులుం బోలె వేదన యుత్పాదింప భవనంబునకు వచ్చి [12]యేకాంతంబ యిచ్చోట నవిరళబాష్పధారాదుర్దినాంధ[13]కారితముఖియై యీ దుర్దశం బొందియున్నయది *(యనుటయు).

30


ఆ.

మంత్రి యొక ముహూర్త మాత్రంబు చింతించి
యుష్ణదీర్ఘమైన యూర్పు నిగుడ
[14]నెంత చింత దీనికిది మహాబలవంత
మేమి సేయవచ్చు నిందువదన.

31


ఉ.

ఊరక [15]కుందనేమిటికి నోంకృతినాథుఁడు నర్మదానదీ-
తీరనివాసి భక్తజనదివ్యమహీరుహ [16]మున్నవాఁడు నీ-
రేరుహనేత్ర తత్పదపరీష్టి యభీష్టశుభాభివృద్ధికిం
గారణమౌ టెఱుంగవె వికారము దక్కు భజింపు శంకరున్.

32


గీ.

ఈశ్వరుం డద్రిజానాథుఁ డిందుమౌళి
కరుణ [17]లేకున్న మనకెట్లు కలుగనేర్చుఁ
జంద్రచందనచంద్రికాశైత్యమైన
పుత్రపరిరంభసౌఖ్యంబు పువ్వుఁబోణి.

33


గీ.

గురుజనంబుల [18]సేవింపు కువలయాక్షి
[19]కమలలోచన ముక్కంటి కరుణఁ జేసి

  1. తా. నేత్రి
  2. తా. బు
  3. తా. యడిగినం
  4. తా. స్నాన
  5. తా. కునికి వర్తించుచు
  6. తా. పీడ
  7. తా. కనారతంబు నే కారణంబు
  8. తా. నిన్న రేపు
  9. తా. ల
  10. తా. కథాకథన
  11. ము. ములికియుం బోలె
  12. తా. యేకాంతంబున నిచ్చోట
  13. తా. కారముఖి
  14. తా. దీని కెటులైన దేవుండు బలవంత
  15. తా. యేడ్వ
  16. ము. మున్ సదాశివున్ సారసనేత్ర
  17. ము. లేకను సుతుఁడెట్లు
  18. తా. సేవించు
  19. తా. నలినముఖి నిష్ఠమీర సంతత మనీష