పుట:శివరాత్రి మాహాత్మ్యము.pdf/39

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


[1]మున్ను గురు నుపదేశంబు మొనయఁ గాంచి-
రభిమతార్థంబు లెందఱే [2]ననుదినంబు.

34


వ.

సర్వజగత్ప్రసిద్ధంబుగదా యితిహాసంబు తొల్లి చండకౌశికు వరప్రసాదంబున మగధాధిపతియగు [3]బృహద్రథుండు జనార్దను గెలువం దగినట్టి శౌర్యనిధి జరాసంధుం గాంచె; దశరథుండు విభాండకతనయుం(డగు ఋశ్యశృంగు) నారాధించి దిగ్గజంబులం బోలిన కుమారుల *(సకలలోకహితంబుగా) నలుగురం [4]బడసె సమారాధిత గురుదేవతాప్రసాద*(వశ)౦బున.

35


గీ.

వెలఁది పుత్రోదయారంభవేళయందు
నిన్ను నెన్నఁడు చూతునో కన్నులార
విమలచంద్రోదయారంభవేళయందుఁ
బూర్ణిమా[5]యామినినిఁ బోలెఁ బుణ్యగరిమ.

36


వ.

దేవీ శోకంబు విడువుము ధైర్యం బవలంబింపుము ధర్మంబు నడువుము దానంబు సేయుము [6]వ్రతంబులు సలుపుము సత్యంబు పలుకుము; మన పాలి దేవతలు మన కభీష్టలాభంబుఁ బొందింపఁగలవారు; భవ్యసంతాన లాభంబున సంతోషంబు వహింపం గలవవి [7]దుఃఖాపనోదననిపుణంబులు ధర్మోపదేశ[8]గర్భంబులు [9]చాటుమధురంబులు నగు మాటల నూరార్చి, కాంచనకలశోదకంబులు కరపల్లవంబున ధరియించి [10]నయనంబులు దుడిచి యగ్గజయానకు ముఖప్రక్షాళనం బాచరించి, మందీభూతదుఖయగుట యెఱింగి మంత్రి యంతఃపురంబు వెడలి సముచితవ్యాపారంబులం బ్రవర్తిల్లె నది యాదిగ [11]నాగమోక్తప్రకారంబున సభక్తివినయతాత్పర్యంబున.

37


ఉ.

ఆ ధవళాయతాక్షి వసుధామరకోటి భజించు దేవతా-
రాధన మాచరించు మునిరాజి కుపాస్తి యొకర్చు [12]మంత్ర వి-
ద్యాధరులన్ నుతించుఁ గొనియాడును యోగిజనంబు వర్ధమా-
నాధికభక్తిభావమున నాత్మజసంతతిలబ్ధికామనన్.

38


గీ.

ఎఱుఁగునే నీడకన్నును నెండకన్నుఁ
[13]జెలఁగి పూఁచునే కర్మవంచిన లతాంగి
యెట్టి క్లేశంబులకునైన [14]నీడఁబోదు
తన మనంబున [15]నిగ్రుచు సంతానకాంక్ష.

39


సీ.

భక్తితో మాతృకాభవనంబుఁకు నేఁగుఁ

  1. తా. మునిజనంబుల భజియించి మున్ను గాంచి
  2. ము. నబ్జవదన
  3. ము. రాజు దైతేయకులవిమర్దను
  4. తా. గాంచె
  5. తా. యామినియు
  6. తా. నేమంబున నోములు నోముము
  7. ము. దుఃఖోపశమనభాషణంబులు
  8. తా. నిపుణంబులు
  9. ము. చారు
  10. తాన యమ్మానినీరత్నంబునకు
  11. తా. సుశీల పరమభక్తితాత్పర్యంబు
  12. ము. మంత్రవిద్యాధృతబుద్ధిఁ గాంచు
  13. ము. చొలవకూచిన కడవంచునే లతాంగి
  14. తా. నీడజోడు
  15. తా. నిగుర్చు