పుట:శివరాత్రి మాహాత్మ్యము.pdf/37

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


 యవిరళాశ్రుపాతార్ద్రీకృతదుకూలయు ననలంకృతయునైన సుశీలం జూచి యజ్ఞదత్తుం డిట్లనియె.

24


గీ.

ఏల యేడ్చెదు చెప్పవే యిందువదన
విపులశోకభరంబున వెక్కివెక్కి
త్రాట గ్రుచ్చిన [1]క్రొత్తముత్యాలవోలెఁ
[2]జన్నుఁగవ నున్న వీ బాష్పజలకణములు.

25


సీ.

కుదురునిండిన మంచి గుబ్బచన్నుల మీఁద
          ధరియింపవేల ముత్యాలపేరు
ఫాలేందురేఖపైఁ బచరింప విది యేల
          కుంకుమంబున బొట్టు గోరఁ దీర్చి
[3]యానబంధోద్ధురంబగు నితంబంబున
          సవరింపవేల వజ్రాల [4]కమరు
పాయవట్టములతోఁ బసిఁడి నూపురములు
          హత్తింపవేల పాదాంబుజములఁ


గీ.

[5]బంచవన్నియరాచిల్కఁ బంజరమున
నేల సదివింప [6]వనురాగ మెసకమెసఁగ
నేల చింతించెదవు తా. చెప్పె యిందువదనచెప్పు మిందువదన
గండపాళికఁ గెంగేలు గదియఁజేర్చి.

26


గీ.

నెలఁత నులివేఁడియైన నీ నిడుదయూర్పు
మాటిమాటికి నిపుడు నా మానసంబు
గంపమొందించుచున్నది కల్లగాదు
ప్రబల భవదీయ వక్షో[7]భవంబుఁ బోలె.

27


క.

అపరాధము సేయఁ గదా
చపలాయత[8]నేత్ర! [9]యేను జనవున[10]నేనిన్
నిపుణతతోఁ జింతించిన
నెప మేమియుఁ గానరాదు నీ నెగులునకున్.

28


క.

భవదాయత్తము విభవము
భవదాయత్తంబు సువ్వె ప్రాణము నాకున్
భవదాయత్తము సర్వము

  1. ము. ముత్యాలదండ వోలె
  2. తా. చన్నులని నున్నయవి బాష్పజరకణములు
  3. ము. యానచక్రోద్ధురంబగు నితంబముమీద
  4. తా. కమలు
  5. తా. పచ్చ
  6. తా. కనురాగ
  7. తా. భరంబు
  8. తా. నేత్రి
  9. తా. నేను జను నొరునేనిన్
  10. తా. నేత్రి