పుట:శివరాత్రి మాహాత్మ్యము.pdf/35

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

యజ్ఞదత్తచరిత్రము

వ.

ఆ రాజునకు నఖిలశాస్త్రవిద్యాకళా[1]పావనగంభీరబుద్ధి యజ్ఞదత్తుండను బ్రాహ్మణుండు దేవేంద్రునకు బృహస్పతియును వృషపర్వునకు శుక్రుండును దశరథునకు వసిష్ఠుండును రామునకు విశ్వామిత్రుండును నజాతశత్రునకు ధౌమ్యుండును [2]నలునకు సుమతియుం బోలెఁ బ్రధానియై రాజ్యభారంబు భరియించియుండు నమ్మంత్రి భార్య వినయవతియు వివేకవతియు విభ్రమవతియు విలాసవతియు సౌభాగ్యవతియు లక్షణవతియు నౌదార్యవతియు గాంభీర్యవతియు లజ్జావతియునై సర్వగుణసంపూర్ణ సుశీలాభిధానయగు [3]భామారత్నం బతనికిఁ [4]బ్రేమాస్పదంబై యుండు.

15


గీ.

అన్ని భాగ్యంబు [5]లున్న నా యజ్ఞముఖికి
శ్రీమహాలక్ష్మి గలుగఁగ నేమి సెలవు
పుత్రవచనావలోకనోద్భూతమైన
యొక్క సౌఖ్యంబు బ్రాఁతియై యుండుఁ గాన.

16


గీ.

[6]తనయసంతానలబ్ధి దౌదవ్వుగాఁగ
విభవసంపత్తి గల్గియు విన్నఁబోయి
వనిత నిష్ఫలపుష్పదర్శనముఁ [7]దాల్చె
శరలతాకాననము వోలె జవ్వనంబు.

17


సీ.

కాంత పుష్పాది బోగంబు [8]లింపనివను
          వైరాగ్యవిధికిఁ దా వాల్చుఁ జిత్త-
మన్వయంబునకుఁ దా నాలంబమయ్యును
          దను నిరాలంబఁగా దలఁచు నింతి
ప్రొద్దునఁ [9]దగినట్టి భోజనం బొల్లక
          యుపవాస [10]నియమంబు నువిద దలఁచు
సంపత్పరంపర సంభవిల్లిననైన
          సంతోష మొదవదు చామ [11]మదికిఁ


గీ.

గోమలాంగుళదళహస్తతామరసము
కర్ణపూరత్వలీలకై కాలుసాఁప
గండతలదర్పణంబునఁ గదియఁ జేర్చి
[12]తరుణి చింతించు ము. సుతలబ్ధి వడయుటకునుసుతులబ్ధి తడయుటకును.

18


ఉ.

సంతతి లేని దుఃఖమున సామజరాజఘటాంతవైభవం-

  1. పావగాహబుద్ధి
  2. తా. హరిశ్చంద్రునకు సత్యకీర్తియును ము. నలునకు దమనుండునుం బోలె
  3. ము. బాలా
  4. ము. బరమప్రియాస్పదంబై
  5. తా. లుంగల
  6. తా. తనయు
  7. తా. దాల్చి
  8. ము. లింపెసఁగిన. తా. లింపనినను
  9. తా. ఁదగునట్టి
  10. ము. నంబుండ
  11. ము. మతికి
  12. ము. పడతి