పుట:శివరాత్రి మాహాత్మ్యము.pdf/13

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


భూతలమునఁ గొమ్మవిభుఁడు పొలుపై వెలసెన్.

20


వ.

తదనుసంభవుండు.

21


సీ.

[1]చేఁపూరి భీమేశుఁ జెలువార గుండెలఁ
          బూజ గావించిన పుణ్యమూర్తి
కడిమిమై నిరువత్తుగండనిచే మల్లి-
          కార్జును కుత్పలం బర్థిఁ బడసె
గొలని రామారెడ్డివలన (శ్రీగిరినాథు
          కర్పించె భరణాలు గరి)మతోడ
భక్తిరాజాఖ్యుచేఁ బర్వతేశ్వరునకు
          నర్పించెఁ [2]జెరువాలు నాతుకూరు


గీ.

ధరణిఁ ద్రిపురాంతకున కాముదాలపల్లి
రాయవేశ్యా[3]భుజంగువల్లావ యిచ్చె
నిట్టి పౌరుష (సంపన్నుఁ డిద్ధయశుఁడు)
పోలిదేవయ్య చెన్నారుఁ బుణ్యమూర్తి.

22


వ.

ఆ గురుస్వామి నిజవంశాచారంబునకు దగిన తలోదరిం బరిణయంబయ్యె నంత.

23


సీ.

గౌరీతలోదరి గాఁబోలు నీ భా(మ
          కారుణ్యవిస్ఫూర్తి గలిగి)యుండు
శ్రీలక్ష్మి గాఁబోలుఁ జెలువ సౌభాగ్యంబు
          దిక్కులనెల్లను బిక్కటిల్లు
వాగ్దేవి గాఁబోలు [4]వామాక్షి బహుశాస్త్ర-
          పాండిత్యవిస్ఫూర్తిఁ బరిఢవించు
నింద్రాణి గాఁబోలు నిందునిభాస్య (తాఁ
          బావన)ఖ్యాతిమై బరఁగుచుండు


గీ.

ననఁగ నే ప్రొద్దు గుణముల నతిశయిల్లి
[5]పరఁగు శ్రీశైలనాథుని పట్టణమునఁ
బోలిదేవయ్య కులసతి పుణ్యచరిత
ముదిత [6]సజ్జననికురుంబ ముమ్మమాంబ.

24


ఉ.*

పోలయ ముమ్మమాంబికలు పుణ్యచరిత్రుల భక్తియుక్తులం
బోలఁగఁ గాంచి రేడ్వురను బుణ్యఋషీశ్వరసప్తతుల్యులం
బోలిన పుత్రసప్తకము భూతహితార్థగుణప్రవృత్తికై
లాలితవిక్రమోన్నతుల లక్షణదివ్యవిచక్షణాత్ములన్.

25
  1. ము. చేవూరి
  2. ము. జెరువాడు
  3. తా. భుజంగమర్లావ
  4. ము. వర్ణిత
  5. ము. పరగ
  6. తా. పరిణజనకదంబ