పుట:శివరాత్రి మాహాత్మ్యము.pdf/12

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


యాతారార్కసుధాంశువై కమలజాతాకల్పమై యెప్పుడున్
జ్యోతిశ్చక్రముఁ బోలెఁ గ్రాలవలదా సొం(పారి కావ్యం బిలన్).

17


వ.

అని యిష్టదేవతాప్రార్థనంబును, గురుప్రశంసయుఁ, గవీశ్వరప్రస్తుతియుఁ, గుకవినిరాకరణంబునుం జేసి యొక్క కవితావిధానంబు శైవంబుగా సుకుమారచరిత్రంబు (చెప్పంబూనిన యవసరంబున) స్వస్తి శ్రీపర్వతస్వయంభూ శ్రీలింగచక్రవర్తి శ్రీమన్మల్లికార్జునమహాదేవుని ముఖమండపంబున సుఖాసీనులయి యంచుగండ(దేవ) పృథ్వీమహా(మహత్తును, నానాదేశాగతానేక బ్రాహ్మణ)భక్తప్రకరంబులును, విజయసదృక్షులగు శుద్ధక్షత్రియులును, ధనపతిసమానసంపద్భాసితులగు వైశ్యులును, నిర్వక్రపరాక్రములగు వీరభటులును, [1](శంకరపురాధ్యక్షులును), స్థానా(ధికారులును, బాహత్తరి)నియోగంబును, గుండలి దండ లాసక [2]ప్రేరణి ప్రేంఖణంబులైన చతుర్విధనృత్తగీతవాద్యాభిజ్ఞులును, గళావిలాస[3]కరణాసనబంధురబంధభేదంబులం [4]గందర్పసంగరప్రవీణలయిన (కురంగలోచనలును బలసి)యుండ, శ్రీశాంతభిక్షావృత్తియతీశ్వరుండు శివకథావిధానంబులఁ [5]బ్రొద్దులు పుచ్చుచుఁ దన మూలభృత్యుండగు [6]నుప్పలపు ముమ్మడిదేవయ్య శాంతునిం గనుంగొని నీ పేర (నంకితంబుగా నంధ్రభాషా) కవిత్వంబున నీ కథ యుపన్యసింపుమనిన మహాప్రసాదంబని సత్కవిసార్వభౌముండగు శ్రీనాథకవివరేణ్యుని గృపావిశేషంబునం గాంచి శ్రీమన్మల్లికార్జున మహాదేవ(దేవు పాదపద్మారాధకులగు) అంచుగండముఖ్య ము. వరుణా... ... ... లోష్ఠ</ref>రేవణసిద్ధ యేకోరామేశ్వర పండితారాధ్యాది చాతుర్వర్ణ్యంబులం గలిగిన మ(తంబుల) యందు (పండితారాధ్యహస్తసంభూత వంశంబులయందు నుద్భవం)బందిన మల్లినాథగురుండు.

18


సీ.

లింగార్చనక్రియాలీల నే ప్రొద్దును
          గరికాల[7]చోడని కరణివాఁడు
జంగమారాధనాసక్తి మై(నేపార
          బల్లాణభూనాథు పాడివాఁడు
పరమశైవాచారపాండిత్యవిస్ఫూర్తి
          సంగన బసువయ్య) సరణివాఁడు
వరధర్మచాతురీవైభవఖ్యాతిచే
          [8]చెన్నమరాయని చెలువువాఁడు


గీ.

ననఁగ నిద్ధాత్రి నింపారు నఖిలకళల
సకలనిర్మాణవిద్యాప్రశస్తుఁ డనఁగ
మానితైశ్వర్యసంప్రాప్త(మహితయశుఁడు)
మల్లికార్జునయోగిసమాజ[9]వరుఁడు.

19


క.

ఆతని వంశంబునఁ బ్ర-
[10]ఖ్యాతచరిత్రప్రతాపకలనాధర్ముం
డాతతవిక్రమశీలుఁడు

  1. తాళపత్రమున లేదు
  2. తా. ప్రేరణ ప్రేక్ష్యకంబులైన
  3. ము. కరుణాబంధుర
  4. ము. గంధర్వసంగర
  5. తా. బ్రొద్దుపుచ్చుచు
  6. ము. పువ్వలపు
  7. తా. భూనాథు
  8. ము. సేనమ
  9. ము. పరుఁడు
  10. ము. ఖ్యాతిగఁ జరితప్రతాప