పుట:శివరాత్రి మాహాత్మ్యము.pdf/11

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


ణావిష్కృతకీర్తిఁ బండితారాధ్యవరున్.

11


సీ.

బాణు నద్భుతశాస్త్రబహుకలాపారీణుఁ
          బ్రకటవరకవితా[భ్యాసు వ్యాసు]
బంధురగాంభీర్య[1]బంధు సుబంధు వి-
          స్ఫురితమహోన్నతిస్తోము సోముఁ
జిరతరమతిభద్రుఁ జెన్నారు శివభద్రు
          నతులగుణస్ఫారు నమ్మయూరు
వరనీతిచాతురీవాగ్భూతి భవభూతి -
          (ముఖ్యసజ్జనదయా)మోఘు మాఘు


గీ.

ఘనవినూత్నవికాసు శ్రీకాళిదాసు
దండికావ్యానులాపవాగ్దండి దండిఁ
జిత్రవాగ్జృంభణప్రఖ్యుఁ జిత్తపాఖ్యుఁ
దగిలి మలహణు బిలహణుఁ (దలఁతు నెపుడు).

12


ఉ.

ఉన్నతమైన [2]యంధ్రకవితోక్తుల నెంతయుఁ బ్రోడలైన యా
నన్నయభట్టు తిక్కకవినాయకుఁ [3]దత్సము శంభుదాసు(నిన్
బన్నగుఁ బోలు నా కమలనాభునిఁ జేరి భజింతు నెంతయున్
సన్నుతశబ్ద)శాస్త్రముల సంఘట(నంబు ఘటించు వేడు)కన్.

13


క.

కృతిపతులగు కవిముఖ్యుల
సతతముఁ గొనియాడి వారి సన్నుత(కరుణా-
మతికిన్ బాత్రుఁడ నేనే
వితతంబగు కవితచెప్ప వెరవని మతితోన్).

14


క.

(ఉఱవైన సుకవి)కోటుల
తెఱఁ [4]గిది యని తప్పులెల్లఁ దీర్తురు వశులై
యెఱుఁగరు సుకవులఁ గుకవులు
కఱకులు [5]వలుకుటయ నేర్పు గర్వప్రౌఢిన్.

15


ఉ.

పద్యగణాక్షరప్రకరభావరసారగుణ(ప్రపూర్ణమై
హృద్యవిలాస)శబ్దపదహేతుకళారససత్క్రియాఢ్యమై
యాద్యులు చన్న మార్గమున నా వళి ప్రాస విడంబబంధమై
చోద్యముగాఁగఁ జెప్పు కృతి శ్రోత్రసుఖావహ మెల్లచోటులన్.

16


శా.

(జాతాజాత చరాచరప్రతతికిన్) [6]సంభూతకస్థానమై
ఖ్యాతంబై బుధహృద్యమంగళకవీంద్రాచార్యసంసేవ్యమై

  1. ము. బంధానుబంధ వి
  2. ము. యాంధ్ర
  3. ము. డెఱ్ఱన
  4. ము. గిదె
  5. తా. గలుగుటయె
  6. తా. సంఘాతక