పుట:శివరాత్రి మాహాత్మ్యము.pdf/10

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


క.

యుక్తాయుక్తనిరీక్షణ
శక్తుఁడు గాఁ డీతఁ డన కజస్రము కరుణా-
సక్తమతి మమ్ముఁ బ్రోవుము
భక్తపరాధీన వీరభద్రస్వామీ.

7


సీ.

ప్ర[కట] గర్జారౌద్రభాసితచంచలో-
          ద్దామనీలాంబుదశ్యామదేహు
దనుజదర్పధ్వాంతదారుణసప్తార్చిఁ
          బన్నగకేయూరుఁ బ్రకటమూర్తి
దారితశ్రీస్థిరాదర [వరహ]స్తుని
          దక్షాధ్వరాటవీదావదహను
శమనజిహ్వాభీలసంకాశఘోరాసి
          దక్షిణదోర్దండధారు వీర-


ఆ.

భద్రు భక్తచిత్తపరిపూర్ణు వాసవ-
వం[దితాం]ఘ్రియుగ్ము వారణాసు-
రారిమూర్తియైన యభినవరూపుని
సన్నుతింతు నేను సరస మెసఁగ.

8


సీ.

దక్షాధ్వరధ్వాంతద[ళనభ]ద్రోద్రేక-
          సప్తాశ్వుఁ డే దేవు చండహేతి
భుగ్నస్ఫుటాభీలభువనసంక్షోభైక-
          గరళ మే దేవు నాక్రమ్యభుక్తి
నిఖిలావనీభారనిర్మలనిర్మాణ-
          కరణంబు లే [దేవు కం]కణంబు-
లంధకాసురభీమహంకారపాథోధి-
          బాడబం బే దేవు భయదశూల-


ఆ.

మమరవరకిరీట విమలకోటీరట-
న్నిబిడమణిమయూఖని[వ]హరుచిర
పాదపద్ముఁడైన పలివెల కొప్పయ్య
నర్థితోడఁ గొల్తు నహరహంబు.

9


చ.

పృథివిని భూధరావలి గభీరము సాగరసప్తకంబు త-
త్ప్రథితనిబంధనంబు వియదంతరమెల్ల కటిప్రదేశ మా
పృథుతరలోకసంఘములు భీమపిచండ మజాండమాలికా-
గ్రథనము నీదు మస్తమని కాంతురు సిద్ధివినాయకాధిపా.

10


క.

భావమునఁ దలఁతు మద్గురు
భావితలోకుని మదీశుఁ బరమేశసమున్
శైవమతగర్వనిర్వహ