పుట:శివరాత్రి మాహాత్మ్యము.pdf/9

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రథమాశ్వాసము

ఇష్టదేవతాప్రార్థనాదికము

శా.

శ్రీ(గౌరీస్తనగంధసారఘుసృణశ్రీ)[1]వాసితోరస్స్థలీ-
నాగాధీశవిశిష్టసంస్తవలసన్నాళీకపాదద్వయ-
ప్రాగల్భ్యుండగు శంకరుండు మనుచుం బ్రత్యక్షమై యెప్పుడున్
యోగీంద్రాఖ్యుని ముమ్మడీంద్రసుతునిన్ నుద్యుక్తశాంతాత్మునిన్.

1


శా.

శ్రీరామారమణుం డశేషజగతీక్షేమంకరప్రక్రియా-
భారాయత్తమనస్కుఁ డార్యజన[2]సంభావ్యుండు భవ్యాత్ముఁడై
గారామారఁగ నుమ్మమాంబికసుతున్ గౌరీశభక్తాగ్రణిన్
ధీరున్ ముమ్మయశాంతునిన్ మనుచు సందీర్ఘాయురర్థాఢ్యుఁగన్.

2


ఉ.

నాలుగు మోములం దనర నాలుగు వేదము లభ్యసించుచున్
నాలుగు నైదు రూపముల నవ్యసుఖ(స్థితి సృష్టి) [3]చేయుచు
న్నాలిని బుక్కిటం దిడి విహాయసవీథిని నంచ నెక్కి తాఁ
జాలఁ జరించు బ్రహ్మ ఘనశాంతుఁడు శాంతనఁ బ్రోచుఁ గావుతన్.

3


చ.

హరిహరపద్మజాదులగు నాద్యులు సంతతభక్తియుక్తులై
చిరమగు నిష్టసంపదలఁ జేకొని లోకములన్ సృజింపఁగా
నరుదుగఁ బ్రేమఁ బ్రోవ లయమందఁగఁ జేయఁగఁ గర్తలైరి నీ
[4]పరమహనీయతత్త్వ మనివార్యము సద్గుణశీల పార్వతీ.

4


గీ.

మదనుఁ గన్నతల్లి మాధవునిల్లాలు
బ్రతుకులెల్లఁ దానె పట్టిచూడ
ముఖ్యమైన లక్ష్మి ముమ్మయశాంతాత్ము
మందిరంబునందు మసలుచుండు.

5


చ.

కవికవితాబ్ధిలోన ముఖగహ్వర మోడయు జిహ్వ త్రెడ్డు హృ-
త్పవనుఁడు పీలికాఁడు మృదుభాషలు రత్నము(లై చెలంగఁగా
కవి పర)మాత్మ వర్తకుని కైవడి నీకు విశేషసత్కృతుల్
గవయఁగ [5]వచ్చె నీవలనఁ గావ్య[6]సుఖాత్ముఁడ [పోలె] భారతీ.

6
  1. ము. వాశ్రి.
  2. తా. సంస్తవ్యుండు
  3. ము. చేసియున్
  4. తా. వర.
  5. ము. నిచ్చె
  6. ము. సుఖస్థితి యిచ్చుఁ గావుతన్