పుట:శివరాత్రి మాహాత్మ్యము.pdf/14

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


సీ.

రామామనోహరరతిరాజ[1]నిభుఁడు శ్రీ-
          మల్లినాథాఖ్యుండు మహిమ వెలయు
(ధర్మార్థసం)చారనిర్మలస్వాంతుండు
          శ్రీగిరినాథయ్య చెలువుమీఱుఁ
బరమశైవాచారపాండిత్యగరిమల
          [2]సెట్టిదేవాఖ్యుండు చెన్నుమీఱు
వైభవప్రఖ్యాతవరహరిశ్చంద్రుండు
          భీమేశ్వరస్వా(మి పెంపుమీఱు)


గీ.

వెలయు ముమ్మడిదేవయ్య వినుతకీర్తి-
ఘనుఁడు కొమరగిరీంద్రుండు గలిగియుండు
(భూతిఁ) బోతలింగాఖ్యుఁడు పొలుపుమీఱు
సప్తఋషులకు నే ప్రొద్దు సము(లనంగ).

26


క.

(వారలలోపల సెట్టియ
ధారుణి శ్రీపర్వతేశు దండాధీశుం
డారయ ననఁగా వెలసెను)
కారణజన్ముండు (నవ్యకావ్యాసక్తిన్).

27


సీ.

(శివరాత్రి నిత్యంబుఁ జెల్లించు విఖ్యాతి
          బసువయ్య దండాధిపాటివాఁడు)
లింగార్చనక్రియా(లీలల నే ప్రొద్దు
          సురియ చౌడాధీశు సొబగువాఁడు)
పరమలింగధ్యానపారీణసద్బుద్ధి
          నల్లమప్రభు లీల నలరువాఁడు
[3]రుచ్యర్పణక్రియారూఢి నిద్ధారణి
          మాదరచెన్నయ్య మహిమవాఁడు


గీ.

చెలఁగె గురులింగజంగమసేవకుండు
మల్లికార్జునశివునకు మంత్రి యనఁగఁ
దూర్పునాఁడెల్లఁ బాలించు నేర్పరతఁడు
శ్రీసమేతుండు పోలయసెట్టివిభుఁడు.

28


వ.

అమ్మహాత్ముండు దన [4]వర్ణంబునకుం దగిన వర్ణనీయయగు సాధ్వి వివాహంబయ్యె నంత.

29


సీ.

పార్వతీమూర్తియు భారతీదేవియు
          నిందిరారూపంబు నింద్రుసతియు

  1. తా. నిభుఁడనా
  2. తా. చిట్టి
  3. తా. రిచ్యయనక్రియాలీలల నిద్ధాత్రి
  4. తా. వర్ణనంబునకు