పుట:శివరాత్రిమాహాత్మ్యము.pdf/36

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శివరాత్రిమాహాత్మ్యము

12


గీ.

పరవాదికుత్కీలభాసురదంభోళి
             పరవాదికేంధనపావకుండు
పరవాదిచయతమఃపటలోగ్రభానుండు
             పరవాదిభోగిసుపర్ణుఁడనఁగఁ
జటులజైనకోలాహలసమర బిరుద
ఘనుఁడు సంగ్రామపార్థుండు వినుతయశుఁడు
శుభుఁడు ముమ్మడిదేవయ్య సుతుఁ డనంగ
వెలసె శాంతయ్య విక్రమవీరవరుఁడు.

36


గీ.

వేడ్కఁ గవిసార్వభౌముని విమలచరిత
స్కాందపౌరాణికంబైన కథలలోన
ఘనత శివరాత్రిచరితంబుఁ దెనుఁగుగాఁగఁ
గరుణఁ జేయుము శ్రీనాథకవివరేణ్య.

37


వ.

అనవుడు నమ్మహీసురాగ్రగణ్యుండు కమలనాభామాత్యపౌత్రుండును మారయామాత్యపుత్రుండును నగు శ్రీనాథకవివరేణ్యుండును సంతుష్టమానసుండై శాంతస్వామి యొసంగిన కర్పూరతాంబూల జాంబూనదాభరణంబులు స్వీకరించి స్కాందంబున నీశానసంహితయందుం జెప్పంబడిన యురులింగోద్భవంబును, శివరాత్రిమాహాత్మ్యంబును,............కథానిధానంబున కధీశ్వరుఁగా శాంత.......

38


షష్ఠ్యంతములు

క.

......................
....................దాననిర్మలమతికిం